విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ఇదే: జెండా సైతం ఆవిష్కరణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే ఈ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. దీని పేరు.. పరివర్తన రాజకీయ పార్టీ. జనం కోసం, జన హితం కోసం, దేశం కోసం, ధర్మం కోసం.. అనేది ప్రధానంగా ఇందులో ప్రతిబింబిస్తోంది. ఈ పార్టీ జెండాను కూడా ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు.
జెండాలో రెండు రంగులను పొందుపరిచారు. ఎరుపు, తెలుపు కలయికతో పార్టీ పతాకం రూపుదిద్దుకుంది. పైభాగంలో ఎరుపు, కింది భాగంలో తెలుపు రంగులు ఉన్నాయి. జెండా మధ్యభాగంలో ఓ చక్రాన్ని పొందుపరిచారు. అశోక చక్రాన్ని పోలిన విధంగా ఉందిది. ఏపీలో మిగిలిన వాటితో పోల్చుకుంటే ఈ పార్టీ పేరు కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఇందులో హిందీ పదాలు దొర్లాయి. పరివర్తన రాజనీతి అనే పదాలు సాధారణంగా దక్షిణాదిన పెద్దగా వినియోగించరు.













Click it and Unblock the Notifications
