రూపాయికి బిగ్ షాక్.. వారం ప్రారంభంలోనే భారీ దెబ్బ..
అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికన్ డాలర్ మళ్లీ బలపడటంతో భారత రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. వారం ప్రారంభంలోనే విదేశీ మార్కెట్లలో డాలర్ పుంజుకోవడంతో, సోమవారం ప్రారంభ వర్తకంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 21 పైసలు క్షీణించి 94.97 స్థాయికి పడిపోయింది. గత వారాంతంలో (శుక్రవారం) రూపాయి మారకం విలువ 94.76 వద్ద ముగియగా, నేడు ట్రేడింగ్ ప్రారంభంలోనే 94.90 వద్ద ప్రారంభమై ఆ తర్వాత మరిన్ని నష్టాల్లోకి జారుకుంది.
రూపాయికి అండగా ముడిచమురు, స్టాక్ మార్కెట్లు
రూపాయి విలువ పడిపోయినప్పటికీ, కొన్ని సానుకూల అంశాలు రూపాయికి కొంత వరకు ఊరటనిచ్చాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం , మన దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగడం రూపాయి మరింత దిగజారకుండా రక్షణగా నిలిచాయి. నేడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3.07 శాతం తగ్గి బ్యారెల్‌కు 109.95 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు తగ్గడం రూపాయికి అనుకూలించే ప్రధాన అంశంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

దేశీయ మార్కెట్లలో కనకాంబరాల పంట!
ఒకవైపు రూపాయి ఒత్తిడికి గురవుతున్నప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం గ్రీన్ మార్క్‌లో దుసుకెళ్తున్నాయి. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 764.72 పాయింట్లు పెరిగి 75,216.80 వద్ద, నిఫ్టీ 201.40 పాయింట్లు పుంజుకుని 23,255.90 వద్ద కొనసాగుతున్నాయి. దీనికి తోడు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు మళ్లీ కొనుగోలుదారులుగా మారి, శుక్రవారం ఒక్కరోజే ₹3,598.54 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం మార్కెట్‌కు బలాన్నిచ్చింది.
ఆర్బీఐ కట్టుదిట్టమైన చర్యలు: భారీ విదేశీ మారక నిల్వలు
రూపాయి హెచ్చుతగ్గులను అదుపు చేసేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సుమారు 720 బిలియన్ డాలర్ల భారీ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉండటంతో మార్కెట్లో తీవ్రమైన కదలికలను నిరోధించగలుగుతున్నారని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్ 30తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు స్వల్పంగా 1.269 బిలియన్ డాలర్లు తగ్గి 719.748 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ, దేశ ఆర్థిక పరిస్థితి భద్రంగా ఉందనే సంకేతాలను ఇస్తోంది. రానున్న రోజుల్లో రూపాయి మారకం విలువ 94.40 నుంచి 95.60 శ్రేణి మధ్య కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.














Click it and Unblock the Notifications
