Exit Poll: సీప్యాక్ ఎగ్జిట్ పోల్ సంచలనం- కూటమి, వైసీపీకి దక్కే సీట్లు ఇవే..!

ఏపీలో నిన్న రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థలకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. వీటిలో కేవలం నాలుగు పోలింగ్ బూతుల్లో మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు వాటిలో రీపోలింగ్ ఇవాళ నిర్వహిస్తున్నారు. వీటిని వదిలేస్తే రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా నడిచిందా, వైసీపీ పుంజుకుందా, ఓటరు నాడి ఎటువైపు ఉందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీ-ప్యాక్ సంస్థ మున్సిపల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ (Exit Poll) ఫలితాలు ప్రకటించింది.

పులివెందులోనే ఎందుకిలా ? మీ ఏకగ్రీవాల సంగతేంటి? జగన్ కు లోకేష్ కౌంటర్..!
పులివెందులోనే ఎందుకిలా ? మీ ఏకగ్రీవాల సంగతేంటి? జగన్ కు లోకేష్ కౌంటర్..!

సీ-ప్యాక్ తాజా ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం రాష్ట్రంలో నిన్న ఎన్నికలు జరిగిన 70 మున్సిపాలిటీల్లో 42 టీడీపీకి లభిస్తాయని వెల్లడించారు. కూటమిలో ఇతర పార్టీలైన జనసేన 14 మున్సిపాలిటీలు, బీజేపీ రెండు, అలాగే విపక్ష వైసీపీ 12 మున్సిపాలిటీలు గెల్చుకోబోతున్నట్లు ఎగ్జిట్ పోల్ లో తేలింది. ఇక మున్సిపల్ కార్పోరేషన్ల విషయానికొస్తే మొత్తం ఎన్నికలు జరిగిన 13 మున్సిపల్ కార్పోరేషన్లలో కూటమిలోని టీడీపీకి 10, జనసేనకు 2, బీజేపీకి ఒకటి దక్కుతుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది.

AP Civic Polls C-PAC Exit Poll Reveals Likely Winners in Municipalities and Corporations
విజయ్ సాయం కోరిన చంద్రబాబు..! రెస్పాన్స్ ఇదే..! నెక్ట్స్ లైన్ లో డీకే..!
విజయ్ సాయం కోరిన చంద్రబాబు..! రెస్పాన్స్ ఇదే..! నెక్ట్స్ లైన్ లో డీకే..!

పార్టీల వారీగా కూటమి గెల్చుకుంటున్న మున్సిపల్ కార్పోరేషన్లలో టీడీపీకి విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు ఉన్నాయి. అలాగే జనసేన విజయవాడ, ఏలూరు కార్పోరేషన్లు దక్కించుకోబోతోంది. అనంతపురం కార్పోరేషన్లో బీజేపీ పాగా వేసే అవకాశం ఉందని సీ ప్యాక్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. వీటిలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా అధికార కూటమికి మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ఎడ్జ్ ఉంటుందని ముందు నుంచీ అందరూ ఊహిస్తుందే. నిన్న పోలింగ్ తర్వాత కూడా అవే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే విపక్ష వైసీపీ మాత్రం 12 మున్సిపాలిటీలు దక్కించుకునే అవకాశం ఉందన్న వార్తలు కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. అదే జరిగితే గత ఎన్నికల్లో రాష్ట్రంలో 11 సీట్లు మాత్రమే గెల్చుకున్న వైసీపీ పుంజుకున్నట్లు భావించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+