కూటమి రెబల్స్ సవాల్ - అగ్రనేతలు చెప్పినా, సీమ..గోదావరిలో కొత్త లెక్కలు..!!
స్థానిక ఎన్నికల్లో రెబల్స్ కూటమి పార్టీలకు సవాల్ గా మారుతున్నారు. పార్టీల అగ్రనేతలు చెప్పినా పలు ప్రాంతాల్లో వెనక్కు తగ్గటం లేదు. తమ లక్కు పరీక్షించుకునేందుకు పోటీలో కొనసాగటం ఇప్పుడు కూటమి సమన్వయానికి సమస్యగా మారుతోంది. రాయలసీమతో పాటుగా గోదావరి జిల్లా ల్లో రెబల్స్ బెడద ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో.. పార్టీల ముఖ్య నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి కారణంగా ఎంత మేర నష్టం ఉంటుందనేది రాజకీయంగా ఉత్కంఠ మొదలైంది.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల తేదీల ను రీషెడ్యూల్ చేసారు. కాగా.. పెద్ద సంఖ్యలో జెడ్పీటీసీ.. ఎంపీటీసీల్లో కూటమి పార్టీల నుంచి పెద్ద సంఖ్య లో రెబల్స్ పోటీ లో నిలిచారు. వీరిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కావటం లేదు. పార్టీల అగ్రనేతలు చెప్పినా వీరు వెనక్కు తగ్గటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గా 26 జెడ్పీటీసీలు.. 170 ఎంపీటీసీల్లో రెబల్స్ బరిలో ఉన్నట్లు గుర్తించారు. ఇవి రాయలసీమతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. కూటమి అధికారంలో ఉండడంతో ఈ సారి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో మూడు పార్టీల నుంచి ఆశావాహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసారు. చివరకు తమకే బీ ఫామ్ దక్కుతుందనే నమ్మకంతో చివరి వరకు వ్యవహారించారు. అయితే... సీట్ల సర్దుబాటులో భాగంగా వారికి అవకాశం దక్కలేదు. దీంతో, ఇప్పటి కే నామినేషన్లు దాఖలు చేసి ఉండటంతో వారు పోటీలో కొనసాగుతున్నారు.

రంగంలోకి ముఖ్య నేతలు
జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికలను ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. అయితే, రాష్ట్రవ్యాప్ తంగా 959 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాల్లో 26 చోట్ల కూటమి రెబల్స్ బరిలో ఉన్నారు. 7853 ఎంపీటీసీ స్థానాలకు గాను 171 స్థానాల్లో రెబల్స్ బరిలో ఉన్నారు. ప్రధానంగా రాయలసీమలో 12 జడ్పీటీసీ, 64 ఎంపీటీసీ స్థానాలకు తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. నంద్యాల జిల్లా లో ఆళ్లగడ్డ, సిరివెళ్ల, పాములపాడు, గోస్పాడు, గడివేముల జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన రెబల్స్ బరిలో ఉన్నారు. అత్యధికంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 31 ఎంపీటీసీల్లో రెబల్స్ బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 6 జడ్పీటీసీ స్థానాలకు, 3 ఎంపీటీసీలకు రెబల్స్ బరిలో కొనసాగుతున్నారు. ఇక.. గోదావరి జిల్లాల్లో అయిదు జడ్పీటీసీలకు, 77 ఎంపీటీసీ స్థానాలకు రెబల్స్ బరిలో ఉండటంతో ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు. పార్టీ అభ్యర్ధులకే ఓట్లు వేయాలని కోరుతున్నారు. దీంతో.. వీరి కారణంగా ఫలితం పైన ఎలాంటి ప్రభావం ఉంటుందనే ఉత్కంఠ మొదలైంది.












Click it and Unblock the Notifications
