బంగారం ధరలు రీబౌండ్- భయపెడుతున్న పరిణామాలు
భారత్ లో నేడు పసిడి ప్రియులకు ఊరట లభించలేదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య బంగారం, వెండి ధరలు దేశీయంగా స్వల్పంగా పెరిగాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న పలు పరిణామాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల తీవ్రత బంగారం, వెండిపై పడింది. ఇరాన్‌పై అదనపు ఆంక్షలు విధించేలా టారిఫ్ పెంచాలని అమెరికా కాంగ్రెస్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించడం ఆందోళనలను పెంచింది. అదే సమయంలో డాలర్ ఇండెక్స్ సుమారు 0.40 శాతం మేర బలోపేతం కావడం వల్ల ఇతర విదేశీ కరెన్సీల వినియోగదారులకు బంగారం కొనుగోలు మరింత భారంగా మారింది.

దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో కూడా ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర 270 రూపాయల పెరిగింది. ప్రస్తుతం 1,44,010 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో కిలో వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.36 శాతం మేర పతనమైంది. రూ. 2,19,730 వద్ద కొనసాగుతోంది. సాధారణంగా మార్కెట్‌లో డిమాండ్ సరఫరాల ఆధారంగా ఈ ఫ్యూచర్స్ ధరల్లో రోజువారీ హెచ్చుతగ్గులు నమోదు అవుతుంటాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,370, 22 క్యారెట్లు రూ. 1,31,423 పలుకుతోంది. వెండి కిలో 2,18,800 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,620, 22 క్యారెట్లు రూ. 1,31,652 కాగా వెండి కిలో ఒక్కింటికి 2,19,180 వద్ద స్థిరపడింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,43,720, 22 క్యారెట్లు రూ. 1,31,753 కాగా.. వెండి కిలో రూ. 2,19,350 గా నమోదైంది. హైదరాబాద్ లో వీటి ధరలు రూ. 1,43,850, రూ. 1,31,863, రూ. 2,19,530గా రికార్డయ్యాయి.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,460, 22 క్యారెట్లు - రూ. 13,255, 18 క్యారెట్లు - రూ. 11,070
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,460, 22 క్యారెట్లు- రూ. 13,255, 18 క్యారెట్లు - రూ. 10,845
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,460, 22 క్యారెట్లు- రూ. 13,255, 18 క్యారెట్లు - రూ. 10,845
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,460, 22 క్యారెట్లు- రూ. 13,255, 18 క్యారెట్లు - రూ. 10,845
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,460, 22 క్యారెట్లు- రూ. 13,255, 18 క్యారెట్లు - రూ. 10,845
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,460, 22 క్యారెట్లు- రూ. 13,255, 18 క్యారెట్లు - రూ. 10,845












Click it and Unblock the Notifications