వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రి కోసం తనయ: ఇవాంకా.. ట్రంప్‌కి పోటీగా మారుతోందా?

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న వివాదాస్పద నేత డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ అమెరికాలో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇవాంకా ట్రంప్‌ పేరు మార్మోగిపోతోంది. అంతేగాక, అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి ఆమే ఎందుకు పోటీ ప‌డ‌కూడ‌దూ? అన్న కొత్త చ‌ర్చ‌కు తెర‌తీసింది.

ఒకే ఒక్క ప్ర‌సంగం ఆమెను రాత్రికి రాత్రే సెల‌బ్రిటీని చేసింది. రిప‌బ్లిక‌న్ నేష‌నల్ క‌న్వెన్ష‌న్‌లో గురువారం రాత్రి ఆమె చేసిన ప్ర‌సంగం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కొంద‌రు రిప‌బ్లిక‌న్ల‌యితే ట్రంప్ బ‌దులు ఆమెనే ఎందుకు బ‌రిలో దింప‌కూడ‌ద‌న్న అంచ‌నాకు వ‌చ్చేశారు. ఆమె క్రేజ్ ఎంత‌లా పెరిగిపోయిందంటే గూగుల్‌లో ట్రంప్ క‌న్నా ఇవాంకా గురించే ఎక్కువ‌గా వెతుకుతున్నార‌ట‌. అంత‌లా ఆక‌ట్టుకుంది ఆమె ప్ర‌సంగం.

A divided Republican party: Donald or Ivanka Trump for president?

త‌న తండ్రి డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్షుడైతే అమెరికాను ఎలా మార్చ‌బోతున్నారో ఇవాంకా క‌ళ్ల‌కు క‌ట్టేలా చేసిన ప్ర‌సంగం సంచ‌ల‌నంగా మారింది. మోడ‌ల్‌, వ్యాపార‌వేత్త అయిన 34 ఏళ్ల ఇవాంకా.. త‌న తండ్రి క‌ల‌ల గురించి క‌న్వెన్ష‌న్‌లో వివ‌రించింది. అమెరికాను ఎలా అభివృద్ధి చేయాల‌నుకుంటుందీ, పిల్లల సంర‌క్ష‌ణ‌, మ‌హిళ‌ల‌కు స‌మాన వేత‌నంలాంటి కీల‌క అంశాల‌పై మ‌న‌సుకు హ‌త్తుకునేలా ప్ర‌సంగించింది.

ఆమె ప్ర‌సంగం విన్న త‌ర్వాత ఈమే అధ్య‌క్ష ప‌ద‌వికి ఎందుకు పోటీ ప‌డ‌కూడ‌ద‌ని టీవీ యాక్ట‌ర్‌ ఆన్స‌న్ మౌంట్ ట్వీట్ చేశారు. తాను విన్న అత్యుత్త‌మ ప్ర‌సంగాల్లో ఇదీ ఒక‌ట‌ని ఉతా డెలిగేట్ క్రిస్ హెరాడ్ పేర్కొన్నారు. ట్రంప్ అధ్య‌క్ష బ‌రిలో నిల‌వాల‌నుకున్న‌ప్ప‌టి నుంచి ఇవాంకా అన్నీ తానే ద‌గ్గ‌రుండి చూసుకుంటుండటం గమనార్హం.

వ్యూహాలు, ఖ‌ర్చుల‌పై ఆమె భ‌ర్త జేరెడ్ కుష్న‌ర్‌తో క‌లిసి త‌ర‌చూ ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. ట్రంప్ ఐదుగురు సంతానంలో ఇవాంకా పెద్ద కూతురు. మ‌హిళా ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డంలో ఇప్పుడు ఇవాంకాదే కీల‌క‌పాత్ర‌గా మారింది. చాలారోజులుగా క్వీవ్‌లాండ్ మొత్తం క‌లియ‌తిరుగుతూ డెలిగేట్స్‌, డోనార్స్‌తో స‌మావేశ‌మ‌వుతోంది.

టీవీ ఇంట‌ర్వ్యూల్లో కూడా ఎక్కువగా క‌నిపిస్తోంది. ఓ రిప‌బ్లిక‌న్ డెలిగేట్ అయితే 2024, అమెరికా తొలి మ‌హిళా అధ్య‌క్షురాలు ఇవాంకా అంటూ ఓ ప్ల‌కార్డు ప‌ట్టుకొని తిరుగుతుండటం విశేషం. గురువారం చేసిన ప్ర‌సంగంలో త‌న తండ్రి గురించి మొత్తం ఇవాంకా చాలా బాగా వివ‌రించింద‌ని, ఆయ‌న ల‌క్ష్యాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టింద‌ని రిప‌బ్లిక‌న్లు చెబుతున్నారు.

ట్రంప్ విజ‌యంలో ఆమె కీల‌క‌పాత్ర పోషించ‌బోతున్న‌ట్లు వారు పేర్కొన్నారు. తండ్రి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం రేపగా.. ఆయన తన అయిన ఇవాంకా మాత్రం తన అద్భుత ప్రసంగాలతో తన తండ్రిని అమెరికా అధ్యక్షుడిని చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

English summary
At times, the speech was drowned out by the cheering crowds in the arena of the Republican National Convention. Social media crowned a new political star. Some Republicans said they were seeing the US president they longed for.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X