వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లి దారుణం: మెడకు తాడు, జంతువులా తిండి, పైగా నెట్లో ఫోటోలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

పిలిప్పీన్స్: ఓ తల్లి తన తనయుడిని చాలా దారుణంగా చూసిన సంఘటన ఒకటి పిలిప్పీన్స్‌లో వెలుగు చూసింది. ఆ బాలుడు చాలా చిన్నవాడు. అతని మెడకు తాడు కట్టి.. అతనికి ఆహారం పెట్టడం, ద్రవపదార్థాలు ఇవ్వడం చేసింది. ఇది ఆమె మానసిక పరిస్థితికి అద్దం పడుతోంది.

అంతేకాదు, ఆ దారుణమైన సన్నివేశాలను ఫోటో తీసి ఆమె ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేసింది. దీంతో ఆమె తీరు పైన సర్వత్రా విమర్శలు వచ్చాయి. వెంటనే పిలిప్పీన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆమె ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆమె ఫేస్‌బుక్‌లో ఫోటోను అప్ లోడ్ చేసిన ప్రాంతం ఆధారంగా ఆమెను 24 గంటల్లో గుర్తించారు. అనంతరం ఆ చిన్నారిని తమ సంరక్షణలోకి తీసుకున్నారు.

Mother posts disturbing Facebook images of son on a leash 'being treated like a dog'

ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేసిన ఫోటోలు.. ఆ చిన్నారి మెడకు తాడు ఉంది. అతను మెల్లిగా పాకుతూ వెళ్తున్నాడు. ఫ్లోర్‌లో అలాగే తిరిగాడు. అక్కడ ఓ చిన్న గిన్నె ఉంది. పరిస్థితి చూస్తుంటే ఆమె కుక్క కంటే హీనంగా చూసిన పరిస్థితి కనిపించింది.

పిలిప్పీన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అడ్ డెవలప్‌మెంట్ అధికారులు ఆ చిన్నారి బాలుడిని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. తల్లిని నిపుణుల వద్దకు తరలించారు.

అయితే, ఇలా ఆమె ఎందుకు చేసిందో తెలియాల్సి ఉంది. దండించడంలో భాగంగానో లేక నవ్వులాటకో ఇలా చేయడం సరికాదని అధికారులు హెచ్చరించారు. కాగా, ఆ తల్లి ఫేస్‌బుక్ అకౌంట్ అప్పటికే తొలగించారు. అయితే, అప్పటికే ఆ ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

English summary
Mother posts disturbing Facebook images of son on a leash 'being treated like a dog'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X