IIT కోచింగ్ లోపం- విద్యార్ధికి 1.35 లక్షలు రిఫండ్ ఇప్పించిన కోర్టు..!


ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా విద్యార్ధులు ఐఐటీల్లో ఇంజనీరింగ్ చదువుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లు (IIT Coaching Centre) కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. లక్షలు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న ఈ కోచింగ్ సెంటర్లు చివరికి విద్యార్ధులకు ఐఐటీలకు ఎంపికయ్యే స్ధాయిలో జేఈఈ ర్యాంకులు అందిస్తున్నాయా అంటే అస్సలు లేదనే సమాధానమే వినిపిస్తుంటుంది. అయినా విద్యార్ధులు, వారి తల్లితండ్రులు వేలం వెర్రిగా వీటి చుట్టూనే తిరుగుతున్నారు. ఈ క్రేజ్ ను సొమ్ముచేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇలాంటి ఓ కోచింగ్ సెంటర్ కు భారీ షాక్ తగిలింది.

Advertisement
IIT: రోజుకు రూ.77 కోట్లు సంపాదిస్తున్న ఐఐటీయన్..! ప్లేస్ మెంట్ ప్యాకేజీల చర్చ వేళ..!
Advertisement

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఐఐటీ కోచింగ్ కోసం ఓ విద్యార్ధి కోచింగ్ సెంటర్ లో చేరాడు. లక్షా 35 వేలు ఫీజు కూడా చెల్లించాడు. కానీ సదరు కోచింగ్ సెంటర్ లో ఎంతకీ క్లాసులు ప్రారంభం కావడం లేదు. దీంతో విసిగిపోయిన సదరు విద్యార్థి ఫీజు తిరిగి ఇచ్చేయమని అడిగితే కోచింగ్ సెంటర్ నిరాకరించింది. దీంతో నాగ్ పూర్ లోని వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కమిషన్.. వాగ్దానం చేసిన విధంగా నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమవడం సేవా లోపమేనని పేర్కొంటూ విద్యార్థి తండ్రికి నష్టపరిహారంతో పాటు రూ.1.35 లక్షల ట్యూషన్ ఫీజును వాపసు ఇవ్వాలని ఆదేశించింది.

Advertisement

కావాలనే IIT పరీక్ష తప్పాడు- అంతకు మించి ఎదిగాడు..! ఓ టాపర్ కథ..!

జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ప్రతివాది (డైరెక్టర్, ఐఐటి పాయింట్, కోచింగ్ క్లాసెస్) ఎటువంటి సహేతుకమైన కారణం లేకుండా వాగ్దానం చేసిన సమయంలో క్లాసులు ప్రారంభించడంలో విఫలమైనట్లు పేర్కొంది. విద్యార్థులను ఆకర్షించే ఉద్దేశ్యంతో బ్రోచర్, ప్రకటనల ద్వారా చెప్పిన సౌకర్యాలు, ప్రమాణాలను అందించడంలో విఫలమవడం, సేవా లోపంతో పాటు అన్యాయమైన వ్యాపార పద్ధతిగా పరిగణిస్తున్నట్లు కమిషన్ వ్యాఖ్యానించింది. సకాలంలో క్లాసులు ప్రారంభించకపోవడం వల్ల విద్యా నష్టం, మానసిక ఒత్తిడికి గురైనట్లు విద్యార్ధి చేసిన వాదనతో కమిషన్ ఏకీభవిస్తూ ఈ తీర్పు ఇచ్చింది.

Advertisement
IIT క్రాక్ చేయలేదు..! కానీ టైర్-3 కాలేజీలో చేరి అద్భుతాలు..! మరో సక్సెస్ స్టోరీ..!