మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ..టైటిల్‌తోనే ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 7వ తేదీన ఎట్టకేలకు అధికారికంగా ఈ చిత్రం విడుదల కానుండగా అంతకంటే ఒకరోజు ముందే ఫ్యాన్స్ కోసం థియేటర్లలో స్పెషల్ షోస్‌తో స్క్రీనింగ్ అయ్యింది. దీంతో ఈ సినిమా ఎలా ఉంది అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇక కొరియన్ కనకరాజ్ మెప్పించాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కొరియన్ కనకరాజు సినిమా టైటిల్‌లో ఉన్నట్టే కొరియాదేశానికి చెందిన ఒక గ్యాంగ్స్‌టర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఆ గ్యాంగ్స్‌టర్ చనిపోయిన తర్వాత ఆత్మ ఊహించని పరిస్థితుల్లో వచ్చి హీరో వరుణ్ తేజ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి గందరగోళం మొదలైంది..? ఆ ఆత్మ హీరో బాడీలోకి వెళ్లి ఏం సాధించింది అనే ఆసక్తికరమైన పాయింట్‌తో కొరియన్ కనకరాజ్ చిత్రం తెరకెక్కింది.తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ థ్రిల్ చేయాలనే ఉద్దేశంతో హారర్ కామెడీ జానర్‌లో దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించారు.
హీరో వరుణ్ తేజ్ కొత్త లుక్,డిఫరెంట్ మేనరిజంతో ఆకట్టుకున్నాడు.హీరోయిన్ రితిక తన పాత్రకు న్యాయం చేశారు. అయితే సినిమాకు అసలు బలం మాత్రం సత్య కామెడీనే.తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కామెడీ ట్రాక్‌ను సత్య అద్భుతంగా క్యారీ చేశాడు.ఎంతలా అంటే స్క్రీన్ పై సత్య కనిపిస్తే చాలు ప్రేక్షకుడు నవ్వాపుకోలేనంతగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక విధంగా ఈ సినిమాకు సత్యనే మెయిన్ వెయిటేజీ ఇచ్చాడని చెప్పాలి. టెక్నికల్‌గా చూస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.దానికి తోడు తమన్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సన్నివేశాలను బాగా ఎలివేట్ చేస్తూ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. కొరియన్ కనకరాజు చిత్రంలో ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి.మొదటి భాగం నెమ్మదిగా సాగడం, స్క్రీన్‌ప్లేలో గ్రిప్ లేకపోవడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. హారర్ కామెడీకి అవసరమైన ఊహించని ట్విస్టులు లేకపోవడం, భయపెట్టాల్సిన సన్నివేశాలు పెద్దగా ప్రభావం చూపకపోవడం నిరాశ కలిగిస్తాయి. దర్శకుడు మేర్లపాక గాంధీ కామెడీని బాగా హ్యాండిల్ చేసినప్పటికీ, హారర్ అంశాలను అంతగా ఎలివేట్ చేయలేకపోయాడు. మొత్తంగా 'కొరియన్ కనకరాజు' కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన వినోదాత్మక హారర్ కామెడీ.కథనం మరింత బిగుతుగా ఉండి,ట్విస్టులు బలంగా ఉంటే ఫలితం మరో స్థాయిలో ఉండేది.అయినప్పటికీ సత్య కామెడీ,తమన్ BGM,ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం ఈ సినిమాను ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. రేటింగ్ 2.5/5సినిమాలో ప్లస్ పాయింట్స్:
90 నిమిషాల కొరియన్ హారర్ థ్రిల్లర్.. రాత్రి ఒంటరిగా చూడలేరు ఛాలెంజ్ !
సినిమాలో మైనస్ పాయింట్స్:
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ హిట్టు కొట్టేశాడు భయ్యా..!