90 నిమిషాల కొరియన్ హారర్ థ్రిల్లర్.. రాత్రి ఒంటరిగా చూడలేరు ఛాలెంజ్ !

ప్రస్తుతం ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారింది. కేవలం రొటీన్ కథలు కాకుండా వినూత్నమైన కాన్సెప్ట్‌లతో వచ్చే సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొరియన్ కంటెంట్‌కు తెలుగు నాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. అలాంటి ఒక సెన్సేషనల్ కొరియన్ హారర్ థ్రిల్లర్ మూవీ 'ఘోస్ట్ ట్రైన్'. 2024లో థియేటర్లలో విడుదలై రికార్డు విజయం సాధించిన ఈ చిత్రం, ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. మన తెలుగు ప్రేక్షకులకు ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది.

'శ్రీనివాస మంగాపురం' సినిమా రివ్యూ.. బొమ్మ సూపర్ హిట్..!
'శ్రీనివాస మంగాపురం' సినిమా రివ్యూ.. బొమ్మ సూపర్ హిట్..!

వ్యూస్ కోసం ప్రాణాలను సైతం..

ఈ సినిమా కథ ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పిచ్చి, యూట్యూబ్ వ్యూస్ కోసం యువత తమ ప్రాణాలను సైతం ఎలా పణంగా పెడుతున్నారనే సున్నితమైన పాయింట్‌తో సాగుతుంది. కథలోకి వెళ్తే.. ఒక యంగ్ ఫీమేల్ యూట్యూబర్ తన ఛానల్‌లో హారర్, సూపర్ నేచురల్ కాన్సెప్ట్‌లపై వీడియోలు చేస్తుంటుంది. అయితే ఎంత కష్టపడినా ఆమె ఛానల్‌కు అనుకున్న స్థాయిలో వ్యూస్, సబ్‌స్క్రైబర్లు రారు. దాంతో ఎలాగైనా తన ఛానల్‌ను పాపులర్ చేయాలనే కసితో, దెయ్యాలు తిరుగుతాయని ప్రచారంలో ఉన్న ఓ పాడుబడిన రైల్వే స్టేషన్‌కు అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక వింతగా ప్రవర్తించే స్టేషన్ మాస్టర్ పరిచయమై, ఆ స్టేషన్‌లో గతంలో జరిగిన నాలుగు భయంకరమైన ఘోస్ట్ స్టోరీలను ఆమెకు వివరిస్తాడు.

థియేటర్లను షేక్ చేస్తున్న చిన్న సినిమా.. రూ. 100 కోట్లు కొళ్లగొట్టి..!
థియేటర్లను షేక్ చేస్తున్న చిన్న సినిమా.. రూ. 100 కోట్లు కొళ్లగొట్టి..!
Ghost Train A 90-minute horror thriller mind-blowing watching it alone at night will make you shiver

అనూహ్య పరిణామాలు జరుగుతాయి

ఆ స్టేషన్ మాస్టర్ చెప్పిన కథలు విన్నాక ఆ యూట్యూబర్ జీవితంలో అనూహ్య పరిణామాలు మొదలవుతాయి. కేవలం వ్యూస్ కోసం వచ్చిన ఆ అమ్మాయి, తనకే తెలియకుండా ఆ 'ఘోస్ట్ ట్రైన్' మిస్టరీ ఉచ్చులో చిక్కుకుంటుంది. అసలు ఆ వింత స్టేషన్ మాస్టర్ ఎవరు? ఆయన చెప్పిన ఆ నాలుగు భయంకరమైన కథల వెనుక ఉన్న నిజమేమిటి? చివరికి ఆ భయానకమైన రైల్వే స్టేషన్ నుంచి ఆ యూట్యూబర్ ప్రాణాలతో బయటపడిందా లేదా అనేదే ఈ సినిమా అసలు కథ.

కేవలం 90 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా, మొదటి నిమిషం నుంచే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తుంది. నరాలకు పనిచెప్పే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, గుండెల్ని పిండేసే జంప్ స్కేర్స్, క్లైమాక్స్ వరకు ఊహకందని సస్పెన్స్‌తో సాగే విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను అమితంగా ఇష్టపడే వారికి 'ఘోస్ట్ ట్రైన్' ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే గుండె ధైర్యం లేనివారు, రాత్రివేళల్లో ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడమే మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+