పెసరపప్పుతో అశోకా హల్వా.. ఇది తింటే మీలో శక్తి డబుల్!

పండుగలు, పబ్బాలు, శుభకార్యాలు ఏవైనా ఇంట్లో తప్పనిసరిగా స్వీట్స్ చేసుకుంటాం. ఇక అటువంటి స్వీట్స్ లో దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేక సందర్భాలలో ప్రాచుర్యం పొందిన ఒక స్వీట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా తమిళనాడులోని తంజావూరు, తిరువయ్యూరు ప్రాంతంలో ఈ స్వీట్ ను ఎక్కువగా చేస్తుంటారు.

Advertisement

నోట్లో వేసుకుంటే కరిగిపోయే అశోకా హల్వా

దీనికి అక్కడ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పెసరపప్పు ,నెయ్యి, గోధుమపిండి, బెల్లం లేదా చక్కెరతో తయారు చేసే ఈ స్వీట్ నోట్లో కరిగిపోతుంది. అశోక హల్వా గా చెప్పే ఈ స్వీట్ చాలా మృదువైన టెక్స్చర్ తో, మంచి రుచితో అందరిని ఆకట్టుకుంటుంది. సరైన విధానంలో తయారు చేస్తే ఈ అశోక హల్వా చాలా బాగుంటుంది.

Advertisement

తయారీకి కావలసిన పదార్థాలు

పెసరపప్పు - అర కప్పు
గోధుమపిండి - 2 టేబుల్ స్పూన్స్
చక్కెర - 3/4 నుండి ఒక కప్పు స్వీట్ ను బట్టి
నెయ్యి - అర కప్పు
యాలుకల పొడి - 4
కుంకుమ పువ్వు - కొద్దిగా
జీడిపప్పు, కిస్మిస్- 15

తయారీ విధానం

ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత దానిని మెత్తని పేస్టులా చేసుకోవాలి. మరోవైపు మందపాటి బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి గోధుమపిండిని స్వల్ప మంటపైన మంచి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో పెసరపప్పు పేస్ట్ వేసి, బాగా కలుపుతూ కొద్ది నిముషాలు ఉడికించుకోవాలి. అందులో చక్కెర వేసి చక్కెర పూర్తిగా కరిగి తిరిగి దగ్గరకు వచ్చేవరకు ఉడికించాలి.

Advertisement

ఇలా చేస్తే అశోకా హల్వా రెడీ

మధ్య మధ్యలో నెయ్యి పోస్తూ కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి, కుంకుమపువ్వు, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ కలిపి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం బాణలి కి అంటకుండా విడిపోతే అశోక హల్వా రెడీ అయినట్టే. ఈ హల్వా లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

బూడిద గుమ్మడికాయ హల్వా ఇలా చేసి తిని చూడండి.. దాంపత్య జీవితం జింగా లాలా!

శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చే అశోకా హల్వా

ఫైబర్, ఐరన్ వంటి పోషకాలతో ఇది మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. అయితే ఇందులో మనం చక్కెర ఉపయోగించడం వల్ల కొద్ది మోతాదులో తీసుకుంటే మంచిది. రుచిగా ఉందని అతిగా ఏది తిన్న అది అనవసరమైన అనర్ధాలను తెస్తుంది. కనుక అశోకా హల్వాను తయారుచేసుకుని మితంగా తిని ఎంజాయ్ చెయ్యండి.

English Summary

ashoka halwa: how to prepare traditional South Indian Ashoka Halwa at home with moong dal, ghee, wheat flour, and sugar. A soft, rich, and delicious festive dessert recipe.