చల్లని వాతావరణంలో క్రిస్పీ క్యాప్సికం బజ్జీలు.. ఇలా చేస్తే అదుర్స్!

వర్షాకాలంలో, వాతావరణం చల్లగా ఉంటే, లేదా చిరుజల్లులు పడుతుంటే వేడివేడి బజ్జీలు తినాలని ఎవరికి మాత్రం అనిపించదు. అయితే చాలామంది మిరపకాయలతో, అరటికాయతో, ఆలుగడ్డ తో బజ్జీలను చేస్తారు. ఇలా కాకుండా రొటీన్ కి భిన్నంగా క్యాప్సికం తో ఎంతో రుచికరమైన బజ్జీలను తయారు చేసుకోవచ్చు.

Advertisement

క్యాప్సికం బజ్జీ.. బెస్ట్ ఈవెనింగ్ స్నాక్

బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ క్యాప్సికం బజ్జీలు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతాయి. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే తక్కువ సమయంలో, ఎక్కువ శ్రమ లేకుండా తయారు చేసుకోగలిగే ఈవినింగ్ స్నాక్ అయిన క్యాప్సికం బజ్జీ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం.

Advertisement

కావలసిన పదార్థాలు

క్యాప్సికం- రెండు పెద్ద సైజు రౌండ్ గా కట్ చేసుకున్నవి
శెనగపిండి- ఒక కప్పు
బియ్యం పిండి- రెండు టేబుల్ స్పూన్లు
కారం - ఒక టీ స్పూన్
జీలకర్ర- టీ స్పూన్
వాము- అర టీ స్పూన్
బేకింగ్ సోడా- చిటికెడు
ఉప్పు- రుచికి సరిపడా
నూనె- వేయించడానికి సరిపడా

తయారీ విధానం

ముందుగా క్యాప్సికంలను శుభ్రంగా కడిగి గింజలు తీసేసి రౌండ్ గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాత్రలో ఒక కప్పు శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, వాము, బేకింగ్ సోడా వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ బాగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా, మరీ చిక్కగా లేకుండా చూసుకోవాలి.

Advertisement

ఇలా చేస్తే క్యాప్సికం బజ్జీ సూపర్

ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణలి పెట్టి అందులో నూనె పోసి స్టవ్ వెలిగించి నూనె వేడి చేయాలి. నూనె కాగింది అని నిర్ధారించుకున్న తర్వాత తయారు చేసుకునే పిండిలో క్యాప్సికం ముక్కలను ముంచి ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

శనగపప్పుతో క్రిస్పీ మసాలా వడలు... ఇలా చెయ్యండి.. లాగించేస్తారు!

ఎంతో సింపుల్ గా క్యాప్సికం బజ్జి

తర్వాత టిష్యూ పేపర్ పైన వాటిని వేసి అదనంగా ఉన్న నూనెను తొలగించాలి. అంతే ఎంతో సింపుల్ గా తయారు చేసుకునే క్యాప్సికం బజ్జీ రెడీ. ఈ బజ్జీలను టమాటా సాస్ తో, లేదా పుదీనా చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి క్యాప్సికం బజ్జి తినడం అలవాటైతే మళ్లీ మళ్లీ కచ్చితంగా కావాలంటారు.

English Summary

capsicum bajji: capsicum bajji is a best evening snack at cool weather in rainy season. know making process of capsicum bajji in home with simple tips and measurements.