వేడి అన్నం, నెయ్యితో అదిరిపోయేలా దోసకాయ టమాటా వంకాయ పచ్చడి!

ప్రతిరోజు కూరలు మాత్రమే కాదు, అప్పుడప్పుడు పచ్చళ్ళు కూడా తినాలి. అది కూడా అప్పటికప్పుడు తయారు చేసుకున్న రోటి పచ్చళ్ళు అయితే మరీ మంచిది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని దోసకాయ టమాటా వంకాయ పచ్చడి వేసుకుని తింటే స్వర్గానికి బెత్తెడే దూరం అన్నట్టు ఉంటుంది. మరి దోసకాయ, వంకాయ, టమాటా పచ్చడి ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుందాం.

Advertisement

కావలసిన పదార్థాలు

దోసకాయ- ఒకటి మీడియం సైజు పొట్టు, గింజలు తీసి ముక్కలుగా కోసుకున్నది
టమాటాలు- మూడు మీడియం సైజు
వంకాయలు- నాలుగు పొడవైనవి రౌండ్ గా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి
పచ్చిమిర్చి- 10 నుండి 12 కారాన్ని బట్టి
వెల్లుల్లి - పది రెబ్బలు
చింతపండు- కొద్దిగా
జీలకర్ర- ఒక టీ స్పూన్
కొత్తిమీర- కొద్దిగా
కరివేపాకు- రెండు రెమ్మలు
ఉప్పు- రుచికి సరిపడా
పోపు గింజలు - ఒక టేబుల్ స్పూన్
నూనె - నాలుగు టేబుల్ స్పూన్
ఎండుమిర్చి -2

Advertisement

తయారీ విధానం

పండుగ వంకాయలను, టమాటాలను ముక్కలుగా కోసుకొని స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వంకాయ ముక్కలను, టమాటా ముక్కలను, తొడిమలు తీసిన పచ్చిమిరపకాయలను ఆ పాన్ లో వేసి మగ్గించండి . అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేయండి. బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి . తర్వాత మిక్సీలో గానీ, రోట్లో గానీ ఈ మిశ్రమం వేసి నూరండి.

గురుపూర్ణిమ స్పెషల్ రవ్వ కేసరి.. ఇలా చేస్తే దేవుడు కూడా ఖుష్!
Advertisement

ఇలా చేస్తే వంకాయ దోసకాయ టమాటా పచ్చడి భలే రుచి

అందులో స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 10 రెబ్బల వెల్లుల్లి వేసి గ్రైండ్ చెయ్యండి. ఈ మిశ్రమంలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసి కలపండి. అందులో కొత్తిమీర కూడా యాడ్ చెయ్యండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కాస్త నూనె వేసి నూనె వేడైన తర్వాత అందులో పోపుగింజలు, ఎండు మిర్చి వేసి వేగాక కరివేపాకు వేసి ఈ మిశ్రమం పచ్చడిలో పోయండి. అంతే రుచికరమైన దోసకాయ, వంకాయ, టమాటా పచ్చడి రెడీ అవుతుంది.

English Summary

Dosakaya Tomato Vankaya Pachadi recipe – Authentic Andhra-style spicy cucumber, tomato & brinjal chutney perfect with hot rice and ghee. Easy step-by-step method for wedding-style taste at home.