ఆకలి అయితే ఏది పడితే అది తినకండి.. ఇవి హెల్డీ స్నాక్స్ తినండి!

ఊబకాయం ఇప్పుడు సమాజంలో అతి పెద్ద సమస్య. ఊబకాయంతో బాధ పడేవారు తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బరువు పెరగకుండా, బరువును తగ్గించుకునేలా హెల్డీ ఫుడ్స్ తినాలి. .అయితే ఆకలి వేసినప్పుడు స్నాక్స్ గా ఎలాంటి హెల్డీ ఫుడ్స్ తినాలి అనేది కూడా తెలియాలి .

Advertisement

10 రకాల ఆరోగ్యకరమైన స్నాక్స్

ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని స్నాక్స్ ఎంత తిన్నా బరువు పెరగవు. అవి తక్కువ క్యాలరీలు కలిగి, పోషకాలు అధికంగా ఉండి, ఎక్కువసేపు ఆకలి తీరుస్తాయి. ఇక్కడ ఎంత తిన్నా బరువు పెరగని 10 రకాల ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏమిటి అనేది తెలుసుకుందాం.

Advertisement

కీరా దోసకాయ ముక్కలు
కీరా దోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఉప్పు, మిరియాల పొడితో తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
క్యారెట్ ముక్కలు
క్యారెట్ ముక్కలలో ఫైబర్ అధికంగా ఉండి, తింటే కడుపు నిండుగా అనిపిస్తాయి.

ఆపిల్ ముక్కలు
ఆపిల్‌లో కూడా ఫైబర్, విటమిన్లు ఉన్నాయి. రోజుకు ఒకటి రెండు తిన్నా సమస్య లేదు. ప్రతీ రోజు ఒక్క యాపిల్ తినటం అలవాటు చేసుకోండి. ఇక డాక్టర్ అవసరం ఉండదు.
పాప్‌కార్న్
ఎయిర్ ఫ్రైడ్ పాప్డ్ పాప్‌కార్న్ కూడా బెస్ట్ స్నాక్. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. బటర్, ఉప్పు లేకుండా తినండి. అదే మంచిది.

Advertisement

టమాటా ముక్కలు
టమాటాలలో నీరు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినండి.
బీన్స్ సలాడ్
బీన్స్ సలాడ్ లో ఉడికించిన చిక్కుళ్లు ఫైబర్, ప్రోటీన్ ఇస్తాయి. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి తింటే చాలా బాగుంటాయి.

పుచ్చకాయ ముక్కలు
పుచ్చకాయలో నీరు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. వేసవిలో బెస్ట్ స్నాక్ గా దీనిని చెప్పవచ్చు. దొరికితే ఏ సీజన్ లో అయినా మితంగా తింటే మంచి ఫలితం ఉంటుంది.
బీట్ రూట్ ముక్కలు
బీట్ రూట్ ముక్కలు క్రంచీగా ఉండి, జీర్ణక్రియకు మంచిది. దీంతో శరీరానికి కావాల్సిన రక్తం పడుతుంది. ఇది మన ఆరోగ్య సంరక్షణకు దోహదం చేస్తుంది.

Advertisement

లెట్యూస్
సలాడ్‌గా తింటే బాగుంటుంది. దీనిలో క్యాలరీలు దాదాపు లేవు.
తక్కువ ఫ్యాట్ ఉండే పెరుగు
గ్రీక్ యోగర్ట్ లేదా తక్కువ ఫ్యాట్ పెరుగు ప్రోటీన్ అధికం. పండ్లు కలిపి తినవచ్చు.
ఈ స్నాక్స్ లో నూనె, చక్కెర, అధిక ఉప్పు వాడకుండా ఉంటే మంచిది. ఆకలిగా అనిపిస్తే ఇవి మాత్రమే తినండి. వేరే ఇతరత్రా స్నాక్స్ ఎంపిక చేసుకోకండి.

English Summary

Know 10 healthy snacks you can eat without gaining weight. Healthy, low-calorie options that keep you full and support weight management.