నోరూరించే కొబ్బరి హల్వా ఇలా చేస్తే తినకుండా వదిలితే ఒట్టు!

మనం కొబ్బరితో అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాం. కొబ్బరి తో స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. కొబ్బరి లవుజు వంటి స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈరోజు మనం కొబ్బరి హల్వా ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం.

Advertisement

కొబ్బరి హల్వా ... దక్షిణ భారతదేశ స్వీట్

కొబ్బరి హల్వా చాలా సులభంగా, తక్కువ సమయంలో ఇంట్లోనే తయారు చేసుకోగలిగే రుచికరమైన దక్షిణ భారత స్వీట్. ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ వంటకాలలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. పండుగలు పూజా కార్యక్రమాలను ప్రత్యేకంగా తయారు చేసి అతిధులకు వడ్డించవచ్చు. తాజా కొబ్బరి తురుమును ఉపయోగించి హల్వా చేసి ఎయిర్ టైట్ కంటైనర్ లో పెడితే ఎక్కువ రోజులు హల్వా నిల్వ ఉంటుంది.

Advertisement

కొబ్బరి హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు

తాజా కొబ్బరి తురుము – 2 కప్పులు

పాలు – 1.5 కప్పులు (లేదా కొబ్బరి పాలు)

నెయ్యి – 4-5 టేబుల్ స్పూన్లు

చక్కెర లేదా బెల్లం పొడి – 1 కప్పు (రుచి ప్రకారం)

జీడిపప్పు, బాదం – 10-12 (వేయించినవి)

ఎండు ద్రాక్ష – చిన్న ముక్క (ఐచ్ఛికం)

యాలుకల పొడి – ½ టీ స్పూన్

కొంచెం ఉప్పు (ఐచ్ఛికం, రుచి మెరుగుపరచడానికి)

తయారీ విధానం:

ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. దానిలో జీడిపప్పు, బాదం ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అదే నెయ్యిలో మిగిలిన నెయ్యి వేసి, కొబ్బరి తురుము జోడించి మీడియం ఫ్లేమ్‌పై 4-5 నిమిషాలు బాగా వేయించాలి. కొబ్బరి తురుము లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు కలుపుతూ వేయించడం వల్ల మంచి సువాసన వస్తుంది.

Advertisement

ఇలా చేస్తేనే హల్వా సూపర్ గా

తర్వాత దీనికి పాలు పోసి బాగా కలపాలి. మిక్స్ చేస్తూ పాలు దాదాపు మరిగే వరకు ఉడికించాలి. పాలు బాగా పట్టి కొబ్బరి దగ్గరకు ఉడికిన తర్వాత, అందులో చక్కెర లేదా బెల్లం పొడి వేసి మరో 8-10నిమిషాలు నెమ్మదిగా కలుపుతూ ఉడికించాలి. చక్కెర కానీ బెల్లంపొడి కానీ వేస్తే అది బాగా లిక్విడ్ లా తయారవుతుంది. తర్వాత సిమ్లో పెట్టుకుని మిశ్రమం గట్టిపడి హల్వా కన్సిస్టెన్సీకి వచ్చేవరకు ఉడికించాలి.

కొబ్బరి హల్వా బెల్లంతో చేస్తే ఆరోగ్యం

దీనిలో యాలుకల పొడి చేర్చి ,చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. హల్వా కొంచెం చల్లారాక గ్రీస్ చేసిన ప్లేట్‌లో పోసి సమానంగా స్ప్రెడ్ చేసి, కట్ చేసి సర్వ్ చేయాలి. వేడిగా లేదా చల్లగా ఈ కొబ్బరి హల్వా ను ఆస్వాదించవచ్చు. కొబ్బరి హల్వా తాజా కొబ్బరి వాడితే బాగుంటుంది. చక్కెరతో చేసే చూడడానికి బాగుంటుంది కానీ, బెల్లంతో చేస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది. నెయ్యి ఎక్కువగా వాడితే హల్వా సాఫ్ట్ గా వస్తుంది.

English Summary

Discover the secret to making delicious Coconut Halwa using leftover coconut after festive pujas. This easy, 20-minute recipe provides a step-by-step guide to creating a soft, melt-in-the-mouth Indian dessert. Perfect for beginners, this guide ensures your festive spread is both traditional and impressively quick to prepare for your family.