ఇంట్లోనే నోరూరించే పాలకోవా..ఇలా చేస్తే వదిలిపెట్టరు!

పాలకోవా పాలతో తయారుచేసే ఒక అద్భుతమైన స్వీట్. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందిన స్వీట్. మెత్తగా, రుచికరంగా ఉండే ఈ స్వీట్ పండగలు, పూజలు, ప్రత్యేక అవసరాలకు చాలా బాగుంటుంది. అత్యంత రుచికరంగానూ, చాలా సింపుల్ గానూ చేసుకోగలిగే పాలకోవా తయారీ ఒకసారి తెలుసుకుందాం.

Advertisement

కావాల్సిన పదార్థాలు

పాలు - 2 లీటర్లు (మంచి నాణ్యత గల పాలు)

Advertisement

చక్కెర - 1.5 కప్ (రుచికి తగినంత, కొంచెం తగ్గించి వేయవచ్చు)

నెయ్యి - 3-4 టేబుల్ స్పూన్లు

ఏలకులు పొడి - ½ టీస్పూన్ (ఐచ్ఛికం)

బాదం / పిస్తా - కొద్దిగా

తయారీ విధానం:

ఒక మందమైన బాటమ్ ఉన్న పాన్‌లో 2 లీటర్ల పాలు పోసి మరగించండి. మరుగుతున్నప్పుడు నిరంతరం కలుపుతూ ఉండాలి. పాలు గట్టిపడే వరకు: మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, పాలు మెల్లగా గట్టిపడే వరకు వండాలి. పాలు సగం కంటే ఎక్కువ మరిగి, చిక్కబడుతున్న సమయంలో కేవలం నాలుగు చుక్కల నిమ్మరసం మాత్రమే వేయాలి. నిమ్మరసానికి బదులుగా శనగ గింజంత పటిక పొడి కూడా వాడుకోవచ్చు.

Advertisement

ఇలా చేస్తే సూపర్ పాలకోవా

దీనివల్ల కోవా తెల్లగా, మంచి లుక్‌తో తయారవుతుంది. ఇది సుమారు 45 నుంచి 60 నిమిషాలు పట్టవచ్చు. అప్పుడప్పుడు బాటమ్ అంటుకోకుండా కలుపుతూ ఉండండి. పాలు గట్టిపడి కోవా లాగా అయిన తర్వాత చక్కెర వేసి బాగా కలపండి. చక్కెర కరిగి మొత్తం మిశ్రమం గట్టిపడే వరకు వండండి. ఆపై ఏలకులు పొడి వేసి మంచి వాసన వచ్చేవరకు ఉడికించండి.

త్వరగా కోవా తయారు కావాలంటే ఇలా చెయ్యండి

మిశ్రమం బాటమ్ నుంచి వదిలి, ఒక గడ్డగా మారేవరకు కలుపుతూ ఉండాలి. మంట ఆపి, మిశ్రమం కొంచెం చల్లగా అయ్యాక చేతులకు నెయ్యి పూసుకొని చిన్న చిన్న ముక్కలుగా లేదా గుండ్రటి షేప్‌లో తీసుకోండి. పైన బాదం, పిస్తా ముక్కలతో గార్నిష్ చేయండి. ఆపై చల్లగా చేసి సర్వ్ చేయండి. పాలకోవా తయారీకి మందమైన బాటమ్ ఉన్న పాన్ వాడటం మంచిది. అప్పుడే పాలకోవా గిన్నెకు అంటుకోకుండా ఉంటుంది. త్వరగా కోవా తయారు కావాలంటే 1 లీటర్ పాలు, 200-250 గ్రా కోవా కలిపి చేసుకోవచ్చు.

English Summary

palakova recipe: Know the secret to making rich, authentic Palakova at home using simple traditional techniques. This guide explores the cultural significance of this sweet, its potential health benefits like migraine relief, and provides a step-by-step method to achieve the perfect, creamy texture using fresh cow milk. Elevate your home-made festive dessert game.