మనం సహజంగా పండుగలు, వివిధ పూజా కార్యక్రమాలలో స్వీట్ చేసి దేవుడికి నైవేద్యంగా పెడతాం. గురు పౌర్ణమి రేపు. అటువంటి గురు పౌర్ణమి నాడు గురువులకు, ఇష్టదైవానికి నివేదించడానికి రవ్వ కేసరి చాలా బాగుంటుంది. మీ గురు పౌర్ణమి సందర్భంగా రవ్వ కేసరి తయారు చేయాలనుకునే వారికి, సింపుల్ గా, సూపర్ టేస్టీగా తయారు చేసే రవ్వ కేసరిని పక్కా కొలతలతో చూద్దాం.
రవ్వ కేసరి తయారీకి కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ - ఒక కప్పు
చక్కెర - 1 నుండి 1 1/4 కప్పు
నీళ్లు- రెండున్నర నుంచి మూడు కప్పులు
నెయ్యి- అరకప్పు
జీడిపప్పు- 15
కిస్మిస్- 15
యాలకుల పొడి- ఆఫ్ టీ స్పూన్
కేసరి రంగు- కొద్దిగా
కుంకుమ- కొద్దిగా
ఉప్పు- చిటికెడు
ముందుగా బాణలీలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి బంగారు రంగు వచ్చేలా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలో రవ్వ వేసి సన్న మంట మీద కంటిన్యూగా కలుపుతూ 6 నుండి 8 నిమిషాలు వేయించాలి. రవ్వ లేత గోధుమ రంగులో మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. అప్పుడు దానిని దించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నీళ్లు పోసి, అందులో పంచదార, చిటికెడు ఉప్పు, కేసరి రంగు, కుంకుమపువ్వు వేసి కలపాలి. పంచదార పూర్తిగా కరిగి సిరప్ అయ్యాక మంట తగ్గించాలి. వేయించిన రవ్వను చక్కెర సిరప్ లో నెమ్మదిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి. రవ్వ నీరు పీల్చుకుని మెత్తగా అయిన తర్వాత మిగిలిన నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలుకల పొడి కూడా వేసి దానిని బాగా కలపాలి. ఆపై మరో రెండు నిమిషాలు దానిని ఉడికించి నెయ్యి పైకి తేలే వరకు చూసి, బాణలికి కేసరి అంటుకోకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన రవ్వ కేసరి రెడీ. ఈ రవ్వ కేసరిని గురు పౌర్ణమి రోజు ఇష్ట దైవానికి, గురువులకు పెడితే వారి ఆశీర్వాదం ఉంటుంది .రవ్వ కేసరి తయారీ విధానం
రవ్వ కేసరి ఇలా చేస్తే బాగుంటుంది
చల్లని వాతావరణంలో క్రిస్పీ క్యాప్సికం బజ్జీలు.. ఇలా చేస్తే అదుర్స్!
రుచికరమైన రవ్వ కేసరి ఇలా