ఇంట్లోనే ఫంక్షన్ స్టైల్ సేమియా కేసరి..పర్ఫెక్ట్‌గా, రుచిగా!

సేమియా కేసరి అనగానే ఇది చాలా మందికి ఇష్టమైన స్వీట్. రవ్వ కేసరి కంటే త్వరగా తయారవుతుంది. మంచి రుచి ఉంటుంది. పండగలు, వ్రతాలు, అతిథులు వచ్చినప్పుడు లేదా ఎప్పుడైనా త్వరగా తినాలనిపించినప్పుడు ఇది సరైన ఎంపిక. 20-25 నిమిషాల్లోనే సేమ్యా కేసరిని సిద్ధం చేసుకోవచ్చు. ఇంట్లోనే సులభంగా అందుబాటులో ఉండే పదార్థాలతో ఎంతో రుచికరంగా ఉండే సేమ్యా కేసరి ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుందాం .

Advertisement

కావాల్సిన పదార్థాలు:

సేమియా - 1 కప్

Advertisement

నీళ్లు - 2 కప్పులు

పంచదార - ¾ కప్ (తీపి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు)

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

జీడిపప్పు - ¼ కప్

ఎండు ద్రాక్ష (కిస్మిస్) - 2 టేబుల్ స్పూన్లు

యాలకుల పొడి - 1 టీ స్పూన్

కుంకుమపువ్వు - చిటికెడు (రంగు కోసం)

తయారీ విధానం:

ముందుగా ఒక పాన్‌లో నెయ్యి కరిగించి, జీడిపప్పు మరియు ఎండు ద్రాక్షను వేసి సువాసన వచ్చే వరకు బంగారు రంగు వచ్చేటట్లు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. అదే పాన్‌లో మిగిలిన నెయ్యి వేసి సేమియాను వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేయించాలి. ఇలా వేయించడం వల్ల సేమియా మంచి క్రిస్పీ రుచి వస్తుంది. తర్వాత ఒక పాత్రలో 2 కప్పుల నీళ్లు పోసి మరగబెట్టండి. ఆ నీళ్లలో చిటికెడు కుంకుమపువ్వు వేసి సహజ రంగు వచ్చేలా చేయండి.

Advertisement

ఇలా చేస్తే సేమియా కేసరి సూపర్ టేస్ట్

మరగుతున్న నీళ్లలో వేయించిన సేమియాను వేసి, మీడియం ఫ్లేమ్‌పై కొంచెం నీరు మిగిలే వరకు ఉడికించాలి. సెమియా బాగా సాఫ్ట్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు పంచదార మరియు యాలకుల పొడి వేసి మరోసారి బాగా కలిపి, మొత్తం మిశ్రమం దగ్గరపడి, నెయ్యి విడివిడిగా కనిపించేవరకు ఉడికించండి. చివర్లో వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్షను వేసి బాగా కలపండి. కొద్దిగా నెయ్యి వేసి దించేస్తే అద్భుతమైన రుచితో సేమియా రెడీ అవుతుంది.

సేమియా రుచికరంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

సేమియాను ముందు నెయ్యిలో బాగా వేయించుకోవడం వల్ల అది అతుక్కోకుండా ఉంటుంది. తీపి మీ ఇష్టం మేరకు సర్దుబాటు చేసుకోవచ్చు. కుంకుమపువ్వు బదులు ఫుడ్ కలర్ కూడా వాడవచ్చు కానీ సహజ రంగు ఎక్కువగా ఇష్టపడతారు. వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయవచ్చు. ప్రసాదంగా కూడా అందించడానికి ఇది బాగుంటుంది.

English Summary

Semiya Kesari: Discover this perfect recipe for Semiya Kesari, focusing on avoiding the common problem of mushiness. Learn easy steps, exact ingredient measurements, and professional tips for achieving the perfect soft texture. Ideal for festivals, quick kitchen cravings, or unexpected guests, this guide helps you prepare restaurant-quality vermicelli dessert at home using simple pantry ingredients.