ఫంక్షన్ స్టైల్ సొరకాయ హల్వా.. ఇలా చేస్తే రుచి అద్భుతః


వివాహాది శుభకార్యాలలో చేసే హల్వా చాలా స్పెషల్ గా ఉంటుంది. విందులు, వినోదాల సమయంలో ముఖ్యంగా చేసే సొరకాయ హల్వా చాలామందికి ఫేవరెట్ స్వీట్. ఈ హల్వా క్రీమీ టెక్స్చర్ తో అద్భుతమైన రుచిని ఇస్తుంది. పండుగలు, ఫంక్షన్లు కానీ, లేదా ఎవరైనా ప్రత్యేకంగా ఇంటికి వచ్చే అతిథులకు కానీ ఇది చేసి పెడితే చాలా సూపర్ గా ఉంటుంది. ఫంక్షన్ స్టైల్ సొరకాయ హల్వా ఎలా తయారుచెయ్యాలో చూద్దాం.

Advertisement

కావలసిన పదార్థాలు

సొరకాయ పొట్టు గింజలు తీసి తురుముకుంది- 750 గ్రాములు
క్రీమ్ మిల్క్- 1.5 లీటర్లు
నెయ్యి- 1/3 కప్
బాదంపప్పు, కిస్మిస్, జీడిపప్పు- 1/3 కప్
పంచదార- ఒకటిన్నర కప్పు
యాలుకల పొడి- హాఫ్ టీ స్కూల్
కుంకుమపువ్వు - కొద్దిగా

Advertisement

తయారీ విధానం

ముందుగా తురుముకున్న సొరకాయను గట్టిగా పిండి నీళ్లను పూర్తిగా తీసివేయాలి. ఇది హల్వా త్వరగా తయారవడానికి కారణమవుతుంది. ఒక గిన్నెలో పాలు పోసి, పాలు చిక్కగా అయ్యేవరకు హై ఫ్లేమ్ మీద గరిటతో కలుపుతూ ఉడికించాలి. అయితే ఈ క్రమంలో పాల రంగు మారకుండా చూసుకోవాలి. వేరే పాన్ లో నెయ్యి వేడి చేసి, అందులో బాదం, కిస్మిస్, జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి. బాగా ఎక్కువ ఫ్రై చేయకూడదు.

సొరకాయ హల్వా ఇలా చేస్తే సూపర్ టేస్ట్

ఆపై అందులో మరికొంత నెయ్యి వేసి తురిమిన సొరకాయను అందులో వేసి కొద్ది నిమిషాలు ఫ్రై చెయ్యాలి, అందులో బాగా చిక్కగా మరిగించిన పాలు మిక్స్ చేయాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆపై అందులో చక్కెర మరియు యాలకుల పొడిని వేసి మళ్లీ 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించాలి. హల్వా బాగా దగ్గరలో వచ్చి నెయ్యి పైకి తేలేవరకు ఉడికించుకోవాలి.

Advertisement
పోషకాల రాగి లడ్డు.. సింపుల్ గా టేస్టీలా ఇలా చెయ్యండి!

సొరకాయలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మంచిది

హల్వా తయారీ తర్వాత చేత్తో హల్వా తీసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. అలా తయారైన తర్వాత అందులో చివరగా వేయించి పెట్టుకున్న నట్స్ వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వేడిగా అయినా, చల్లగా అయినా సర్వ్ చెయ్యవచ్చు. సొరకాయలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మంచిని చేయడంతో, స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా కలిగిస్తాయి.

English Summary

sorakaya halwa:Delicious Wedding Style Bottle Gourd Halwa (Sorakaya Halwa) recipe. Rich, creamy dessert made with grated bottle gourd, reduced milk, ghee, and nuts. Perfect for festivals and special occasions.