ఆగస్ట్ నెలంతా హంస మహాపురుష రాజయోగంతో ఈ రాశులవారికి లక్ష్మీకటాక్షం!

2026 ఆగస్టు నెల మొత్తం హంస మహా పురుష రాజయోగం క్రియాశీలకంగా ఉంటుంది. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో గురు గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Advertisement

శక్తివంతమైన హంస మహాపురుష రాజయోగం

శక్తివంతమైన హంస మహా పురుష రాజయోగం కారణంగా ఈ నెల అంతా కొన్ని రాశుల వారికి ధన లాభం కలుగుతుంది. వారు రాజ భోగాలను అనుభవిస్తారు. ఆధ్యాత్మిక వృద్ధి జరుగుతుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మరి హంస మహా పురుష రాజయోగంతో లబ్దిని పొందే రాశులను గురించి తెలుసుకుందాం.

Advertisement

మకర రాశి

హంస మహా పురుష రాజయోగం కారణంగా మకర రాశి వారికి ఏడవ ఇల్లు బలపడుతుంది. ఈ రాజయోగం ఫలితంగా వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాలు విజయాన్ని అందిస్తాయి. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం ఉంటుంది.

మేష రాశి

హంస మహా పురుష రాజయోగం కారణంగా మేష రాశిలో 4వ గృహం బలపడుతుంది. ఈ సమయంలో మేషరాశి వారి కుటుంబంలో సంతోషం కలుగుతుంది. ఆస్తి, వాహన విషయాలలో సానుకూలతలు కనిపిస్తాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వారికి కలిసి వస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పొదుపు పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

Advertisement

తులా రాశి

హంస మహా పురుష రాజయోగం కారణంగా తులా రాశి వారి దశమ స్థానం బలపడుతుంది. సమయంలో మీకు వృత్తిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు వస్తాయి. మీ పని ఉన్నతాధికారులతో ప్రశంసించబడుతుంది. కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. వ్యాపారాలను విస్తరించడానికి ఇది మంచి సమయం. సమాజంలో గొప్పవారి సాన్నిహిత్యంతో మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది.

బుధాదిత్య యోగం మొదలైంది.. 22రోజులు ఈ రాశులు పట్టిందల్లా బంగారం అవుతుంది!

వృశ్చిక రాశి

హంస మహా పురుష రాజయోగం వృశ్చిక రాశి వారిని అదృష్టజాతకులుగా చేస్తుంది. ఈ సమయంలో మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు చూస్తారు. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సమాజంలోనూ, పనిచేసే చోట గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార ఒప్పందాలు, కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది.

Advertisement

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

English Summary

Hamsa Mahapurush Rajyoga 2026 formed by Jupiter in Cancer. Cancer and four other zodiac signs to get huge wealth, career growth and prosperity from this rare yoga.