రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు... కలెక్టర్లకు సీఎస్ అలెర్ట్!

తెలంగాణా రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలో మొన్నటివరకు వర్షాభావ పరిస్థితులు ఉండగా, ప్రస్తుతం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణా రాష్ట్రంలో అనేక జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్ లో కూడా అనేక ప్రాంతాలు భారీ వర్షాన్ని చూస్తున్నాయి.

Advertisement

రానున్న 5రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నేడు హైదరాబాద్ నుంచి డీజీపీ సి.వి. ఆనంద్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వర్ష పరిస్థితులు, ముందస్తు చర్యలపై సమీక్షించారు.

Advertisement

తెలంగాణా సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ .. కీలక సూచనలు

ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన జిల్లా కలెక్టర్ లకు, ఎస్పీలకు వర్షాల నేపధ్యంలో కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ వర్షాలు, వరదల కారణంగా ప్రాణనష్టం జరగకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

24 గంటలు పనిచేసే కంట్రోల్ రూములు ఏర్పాటు

వర్షాల నేపధ్యంలో జిల్లాల్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూములు ఏర్పాటు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, పడవలు, జేసీబీలు తదితర సహాయక సామగ్రిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ తగిన విధంగా స్పందించాలని జిల్లా కలెక్టర్ లకు సూచించారు.

Advertisement
పెద్ది సుదర్శన్ రెడ్డిది హార్ట్ ఎటాక్ కాదు.. ఆ టాబ్లెట్ వల్లే.. ఫైనల్ డెసిషన్ ఫ్యామిలీదే!

పోలీసు శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందన్న డీజీపీ సీవీ ఆనంద్

డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ పోలీసు శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రమాదకర వంతెనలు, కల్వర్టులు, పర్యాటక ప్రాంతాలు, జలపాతాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు, ప్రజలు వరద నీటిలోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను అలెర్ట్ చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా వర్షాల సమయంలో జాగ్రత్త వహించాలన్నారు.

English Summary

heavy rains alert: Chief Secretary Sanjay Jaju directs district administration to remain alert amid heavy rains for next 5 days. Calls for preparedness to handle flood situation across Telangana.