నవగ్రహాలలో ప్రతి గ్రహం దేనికదే ప్రత్యేకం. అటువంటి గ్రహాలలో బృహస్పతి ఒక విశిష్టమైన స్థానం ఉంది. దేవగురువు బృహస్పతి గ్రహస్థితి అన్ని రాశులవారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం దేవగురువు బృహస్పతి 40రోజులుపాటు అస్తమయం చెంది ఆగస్టు 14వ తేదీన కర్కాటక రాశిలో మళ్లీ ఉదయించబోతున్నాడు.
ఉచ్ఛరాశిలో గురువు ఉదయం
గురువు తన ఉచ్ఛ రాశిలో ఉదయించడం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావం పడినా, కొన్ని రాశుల వారికి మాత్రం కలిసి వస్తుంది. వారి జీవితంలో గొప్ప మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
కుంభ రాశి వారికి ఆగస్టు 14వ తేదీ నుండి కలిసి వస్తుంది. కర్కాటక రాశిలో గురు ఉదయం ప్రత్యేకంగా కుంభరాశి వారికి శుభకరంగా ఉంటుంది. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. అదృష్టం తోడవడంతో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. కుటుంబంలో అపార్థాలు తొలగి సామరస్యం పెరుగుతుంది. కుంభ రాశి వారికి మంచి వార్తలు వినిపించి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించే శక్తి పెరుగుతుంది. వృషభ రాశి వారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుండో నిలిచిపోయిన కార్యాలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో వృషభ రాశి వారు శుభవార్తలు వింటారు. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబ మద్దతు బలపడుతుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. సింహ రాశి వారికి ఆగస్టు 14 నుండి కెరీర్‌లో పురోగతి, గుర్తింపు లభించే అవకాశం ఉంది. ధనలాభాలు, వ్యాపార వృద్ధి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ పాత్ర పోషించే అవకాశాలు రావచ్చు. సింహ రాశి వారు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారుతున్నారు. తుల రాశి వారికి ఆగస్టు 14 నుండి కలిసి వస్తుంది. ఆగస్టు 14 నుండి వీరికి భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా మారతాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. ఇది తులా రాశి జాతకులకు అదృష్టం ప్రారంభమయ్యే కాలం. గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.కుంభరాశి
వృషభ రాశి
సింహ రాశి
ఆగస్టు 5 నుంచి 17 వరకు మూడు గ్రహాల రచ్చ.. వీరికి మహారాజయోగం!
తులా రాశి