శని తిరోగమనంతో ఈ రాశులవారికి ఆరునెలలు దురదృష్టం!


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో ప్రతి గ్రహము ప్రత్యేకమైనవే. గ్రహాలలో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే గ్రహం న్యాయాధిపతి సహనాన్ని ఇచ్చే దేవుడు శని దేవుడు. అటువంటి శని దేవుడు మన కర్మ ఫలాల మీద ప్రభావం చూపిస్తాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్న శని దేవుడు తిరోగమనంలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

Advertisement

వచ్చే ఆరునెలలు ఈ రాశులవారికి ఇబ్బందులు

రాబోయే ఆరు నెలల పాటు కొన్ని రాశుల వారి వివిధ సవాళ్లను ఎదుర్కొంటారని, ముఖ్యంగా మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల వంటివి ప్రధానంగా ఎదురవుతాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఏ ఏ రాశుల వారు వచ్చే ఆరు నెలలు ఇబ్బందులు ఎదుర్కొంటారో ప్రస్తుతం తెలుసుకుందాం.

Advertisement

మేషరాశి

మేషరాశి జాతకులు వచ్చే ఆరు నెలలు కష్టపడాల్సి వస్తుంది. ఈ సమయంలో సహనంతో మీరు పని చేస్తే కొంతవరకు ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు జాగ్రత్త వహించాలి. లాభాలు వస్తాయని అత్యాశకు పోయి ఏ పని చేయకూడదు. మానసిక ఆందోళన కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి

కుంభ రాశి వారు కుటుంబ వ్యవహారాలలో ఎక్కువ జాగ్రత్త వహించాలి. మాటల్లో అదుపు ఉంచుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్త. ఖర్చులు నియంత్రించుకోవలసిన అవసరం ఉంది. ఖర్చులను కంట్రోల్ చేసుకోకపోతే అనవసరపు ఇబ్బందులు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం మంచిది కాదు.

Advertisement
వచ్చే 10రోజులు ఈ రాశులవారు జాగ్రత్త.. మీకు అగ్ని పరీక్షే!

మీనరాశి

శని ప్రభావంతో మీన రాశి వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. వర్తక వ్యాపారాలు చేసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. చిన్నపాటి తప్పులు కూడా పెద్ద సమస్యలకు కారణమవుతాయి. ఏ నిర్ణయం తీసుకున్న ఆలోచించి తీసుకోవలసిన అవసరం ఉంది. మానసికంగా బలంగా ఉండడం అవసరం. ఆందోళనలు సమస్యలను పరిష్కరించమని విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు రాశులవారు శని ప్రతికూల ఫలితాలను నుండి ఉపశమనం పొందాలంటే శనివారం రోజు నల్లటి వస్తువులను దానం చేయాలి. శని దేవుడికి నువ్వుల నూనెను సమర్పించి పూజించాలి.

Advertisement

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

English Summary

saturn retrograde: Lord Shani influences the fruits of our karma. Currently, Lord Shani is transiting through the Pisces sign in retrograde motion. these zodiacs are unlucky for 6 months