ఆగస్టులో సంపూర్ణ సూర్యగ్రహణం.. వీరికి జాక్ పాట్!

వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణాలు కేవలం ఖగోళ సంఘటనలు మాత్రమే కావు. అవి మానవ జీవితాలపై, రాశి చక్రాలపై తీవ్ర ప్రభావం చూపే పరిణామాలు. సహజంగా గ్రహణాలను ప్రతికూల ఫలితాలను ఇచ్చేవిగా చూస్తారు. ఆగస్టు 12వ తేదీ 2026 సంవత్సరం అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం ఆర్కిటిక్, గ్రీన్ ల్యాండ్, ఐస్లాండ్, స్పెయిన్, అట్లాంటిక్ ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

ఆగస్ట్ 12న సూర్యగ్రహణం

సూర్య గ్రహణం ఏర్పడే సమయం భారతదేశంలో రాత్రివేళ కావడంతో ఇక్కడ కనిపించదు. భారతదేశంలో సూతక కాల నియమాలు కూడా వర్తించవు. కానీ జ్యోతిష్యపరంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువుల ప్రత్యేక కలయిక వలన కొన్ని రాశులవారి జీవితాల్లో పెద్ద మార్పులు రానున్నాయి. ముఖ్యంగా మూడు రాశులవారికి సూర్య గ్రహణం అత్యంత శుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

మేషరాశి

మేష రాశి వారికి సంపూర్ణ సూర్యగ్రహణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి భారీ లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి కి అవకాశం ఉంది. వర్తక, వ్యాపారాలు చేసే వారికి కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. ఈ సమయం మేష రాశి వారికి బాగా కలిసి వచ్చే సమయం.

సింహరాశి

సూర్యుడు సింహరాశికి అధిపతి కావటంతో ఈ సూర్యగ్రహణం వీరికి విశేషమైన శక్తిని, కొత్త అవకాశాలను ఇస్తుంది. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది.

Advertisement
ఉచ్ఛస్థితిలో బృహస్పతి.. ఈ రాశులవారికి కలిసొస్తుంది కానీ...

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి. ధనుస్సు రాశి వారి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వీరి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగ్గా ఉంటుంది. ఈ సూర్య గ్రహణం కారణంగా వీరు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారు.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

English Summary

Solar Eclipse on August 12th 2026 brings major luck and life changes for Aries, Leo and Sagittarius. Career growth, financial gains and new opportunities expected for these zodiac signs.