నేడు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ఈ రాశులవారి పంట పండుతుంది!

ఆగస్టు 5, 2026 బుధవారం. నేడు విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉన్న రోజు. ఈ రోజు చంద్రుడు మేష రాశిలోకి సంచరిస్తున్నాడు. దీని ప్రభావం వల్ల 12 రాశుల వారి వృత్తి, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తాయి. నేడు కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది.

Advertisement

మేషరాశి: మేషరాశి జాతకులకు నేడు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. నేడు మాటలను నియంత్రించుకోండి. అనవసర గొడవల నుంచి దూరంగా ఉండండి. డబ్బు విషయంలో మంచి సమయం. కష్టపడి చేసిన పనుల ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబసభ్యులతో సహనంగా ఉండండి.
వృషభరాశి: ఈ రోజు మీకు అదృష్టవంతమైనది. చేసే పనుల్లో లాభాలు ఉంటాయి. పెద్ద ప్రాజెక్టుల్లో అడ్డంకులు తగ్గుతాయి. ఉద్యోగంలో మీ కృషిని అభినందిస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది.

Advertisement

మిథునరాశి: నేడు మిధునరాశి వారికి మంగళకరమైన కాలం. చేసే పనులు విజయవంతమవుతాయి. అనూహ్య లాభాలు రావచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రస్తుత ఉద్యోగంతో పాటు కొత్త అవకాశాలు వెతకవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటకరాశి: కర్కాటక రాశి వారికి నెమ్మదిగా ఉండాల్సిన రోజు. మాట్లాడే ముందు ఆలోచించండి. వ్యాపారస్తులకు అనూహ్య ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థికంగా మంచి సమయం కానీ ఖర్చులు నివారించాలి.

సింహరాశి: నేడు సింహ రాశి వారికి కొన్ని సవాళ్లు ఉన్నా ధైర్యంగా ఎదుర్కోండి. అధికారుల మాటలను నిర్లక్ష్యం చేయకండి. డబ్బు విషయంలో మిశ్రమ ఫలితాలు. ఉద్యోగం వెతుకుతున్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కన్యరాశి: కన్యా రాశి వారికి నేడు శుభమైన రోజు. సానుకూల ఆలోచనలు ఉన్నవారితో సమయం గడపండి. ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకుంటే సమస్యలు తొలగుతాయి. పనిలో సాధారణ ఫలితాలు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి.

Advertisement

తులారాశి: తులా రాశి వారికి నేడు ఉద్యోగంలో మీ ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక స్థితి బలపడుతుంది. పెద్ద ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
వృశ్చికరాశి: నేడు వృశ్చిక రాశి జాతకులు సవాళ్లు ఉన్నా లాభాలు చూస్తారు. పాత రుణాలు తీర్చుకునే అవకాశం. ప్రైవేట్ ఉద్యోగులకు కొత్త అవకాశాలు, ప్రమోషన్ అవకాశం ఉంది.

ధనుస్సురాశి: నేడు ధనుస్సు రాశి జాతకులకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. సమస్యలు తగ్గుతాయి. గత కృషి ఫలాలు కనిపిస్తాయి. ఆర్థికంగా మార్పులు కనిపిస్తాయి.
మకరరాశి: నేడు మకరరాశి వారికి మంచి ప్రారంభం. కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి తగ్గించుకోండి. ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత ఉంటుంది.

Advertisement
బృహస్పతి ఉదయంతో ఈ రాశులవారికి అన్ని విధాలా సంపదల వర్షం!

కుంభరాశి: కుంభ రాశి వారికి నేడు సాధారణ ఫలితాలు ఉన్నాయి. కొత్త ప్రణాళికలపై దృష్టి పెట్టండి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి.
మీనరాశి: నేడు మీనరాశి జాతకులు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఓపికతో పని చేస్తే మంచి ఫలితాలు. కుటుంబ మద్దతు లభిస్తుంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

English Summary

Today rashiphalalu: Career and finance horoscope for 5 August 2026: Moon transit in Aries brings positive results for Taurus and Virgo. Check daily job and money predictions for all 12 zodiac signs.