నేడు ఈ రాశులవారికి సంపదలు.. వీరికి కష్టాలు.. ద్వాదశ రాశులకు ఇలా!

జూలై 27 2026 సోమవారం నాడు పరమశివునికి అంకితమైన రోజుగా చెప్పబడింది. నేడు చంద్రుడు ధనుస్సురాశిలో సంచారం చేస్తాడు. వృషభరాశిలో కుజుడు, బుధుడు మిధునరాశిలో గురుడు మరియు సూర్యుడు కర్కాటకరాశిలో, కేతువు మరియు శుక్రుడు సింహరాశిలో, మీనరాశిలో శని తన సంచారాన్ని కొనసాగిస్తున్నారు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు. ఈ గ్రహాల స్థితి 12 రాశుల వారి జీవితం పైన ప్రభావం చూపిస్తుంది. నేడు ద్వాదశ రాశుల వారి ఫలాలు చూద్దాం.

Advertisement

మేషరాశి: నేడు మేష రాశి వారికి ఆర్థిక ఒడిదుడుకులు తగ్గుతాయి. బ్యాంకింగ్, పెట్టుబడి సమస్యలు తీరుతాయి. కమ్యూనికేషన్ బలంగా ఉంటుంది.

Advertisement

వృషభ రాశి: వృషభ రాశి జాతకులు నేడు ఖర్చులను నియంత్రించాలి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వారు మంచి వార్తలు వింటారు. బాగా కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు వస్తుంది.

మిధున రాశి: మిధున రాశి వారి ఆర్థిక నిర్ణయాలు ఈ సమయంలో చాలా స్పష్టంగా ఉంటాయి. పాత పెట్టుబడులను సమీక్షించుకుంటే మంచిది.

కర్కాటక రాశి: సూర్య గురు ఆశీస్సులతో కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. దీర్ఘకాలిక పొదుపు పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

సింహరాశి: సింహ రాశి వారికి భౌతిక సుఖాల పైన ఖర్చు పెరుగుతుంది మీడియా, విద్య రంగాలలో పనిచేసే వారికి బాగుంటుంది. మార్కెటింగ్ లో పనిచేసే వారికి లాభాలు వస్తాయి.

Advertisement

కన్యారాశి: కన్య రాశి వారు నేడు శుభ ఫలితాలను చూస్తారు. బడ్జెట్ సరిచేసుకుంటే మంచిది. మీ దగ్గరకు సహోద్యోగులు సలహా కోసం వస్తారు.

తులారాశి: తులా రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు సానుకూల పరిణామాలను చూస్తారు.

ధనుస్సు రాశి: చంద్రుడి ప్రభావంతో ధనుస్సు రాశి వారికి ఉత్సాహం పెరుగుతుంది. బోధన, ఉన్నత విద్యలో ధనుస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో పాత బాకీలు వసూలు అవ్వవచ్చు. పరిశోధనలలో విజయం సాధిస్తారు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

Advertisement
ప్రత్యక్ష సంచారంలోకి బుధుడు.. ఆగస్ట్ 5వరకు ఈ రాశులకు శుభాలు, లాభాలు!

మకర రాశి: మకర రాశి వారు కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా మకర రాశి వారికి స్థిరత్వం ఉంటుంది. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

కుంభరాశి: కుంభ రాశి వారికి సామాజిక సంబంధాలు, నెట్వర్కింగ్ కారణంగా లాభం కలుగుతుంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాలలో పనిచేసే వారికి బాగుంటుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం.

మీనరాశి: మీన రాశి వారు సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా స్వల్ప లాభాలు ఉంటాయి. ఆరోగ్యం మానసిక ప్రశాంతత పై దృష్టి పెడితే మంచిది. ఈ సమయంలో మీరు ఎవరినైనా సహాయము అడిగితే లభిస్తుంది.

Advertisement

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

English Summary

Today rashiphalalu: Full career and finance horoscope for 27 July 2026 including Scorpio, Capricorn, Aquarius and Pisces. Predictions for all 12 zodiac signs.