నేడు సూర్య, గురు గ్రహాల దయతో వీరికి కలిసివస్తుంది.. వీరికి కష్టమొస్తుంది!

జులై 28 మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడిన రోజు.నేడు జ్యోతిష్య శాస్త్రంలో కూడా చాలా ప్రత్యేకమైన రోజు. నేడు సాయంత్రం చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలో సూర్య, గురు గ్రహాల సంచారం కూడా చాలా ప్రత్యేకమైనది. ఆర్ధిక మరియు వృత్తి సంబంధిత విషయాలలో కొన్ని రాశుక వారికి నేడు కలిసి వస్తుంది. నేడు గ్రహాల స్థితి కారణంగా ద్వాదశ రాశులవారి జాతకాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

Advertisement

మేషరాశి: మేషరాశి జాతకులకు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభాలను ఇస్తాయి.
వృషభరాశి: నేడు వృషభరాశి వారి ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. ఎప్పటినుండో వసూలు కాని బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్ళాలి.
మిథునరాశి: నేడు మిథునరాశి జాతకులకు ఉద్యోగ మార్పుకు అనుకూల సమయం. వ్యాపారంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

Advertisement

కర్కాటకరాశి: నేడు ఉద్యోగ మార్పు కోరుకునే కర్కాటక రాశి వారికి అనుకూల సమయం. కర్కాటకరాశి జాతకులకు వ్యాపారంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
సింహరాశి: సింహరాశి వారికి నేడు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ లు ప్రారంభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
కన్యారాశి: కన్యారాశి జాతకులు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగంలో ఓర్పుతో వ్యవహరించాలి .

తులారాశి: తులారాశి జాతకులకు నేడు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చికరాశి: వృశ్చిక రాశి వారి ఆదాయమార్గాలు నేడు విస్తరిస్తాయి.కొత్త పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం మంచిది.
ధనుస్సురాశి: నేడు ధనుస్సు రాశి వారికి కార్యాలయంలో ప్రతిభకు గుర్తింపు వస్తుంది. ఆర్ధికంగా స్థిరత్వం ఏర్పడుతుంది.

Advertisement
ప్రత్యక్ష సంచారంలోకి బుధుడు.. ఆగస్ట్ 5వరకు ఈ రాశులకు శుభాలు, లాభాలు!

మకరరాశి: మకరరాశి వారు నేడు ప్రణాళికా బద్దంగా పని చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో మకరరాశి వారికి పురోగతి కనిపిస్తుంది.
కుంభరాశి: కుంభరాశి జాతకులకు ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెంచుకునే మార్గాలు కనిపిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు.
మీనరాశి: మీనరాశి జాతకులు కుటుంబ సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవటం మంచిది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

English Summary

Today rashiphalalu: Check career, business, finance, and money predictions for all 12 zodiac signs. Know how planetary movements may influence your professional and financial life today.