నేడు జులై 15 మంగళవారం ఈరోజు జ్యోతిష్యపరంగా గ్రహాల గమనంలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతోంది. జ్ఞానకారకుడైన గురుగ్రహం కర్కాటకరాశిలో సూర్యుడికి సమీపంలోకి రావడం వల్ల అస్తమయం చెందుతున్నాడు. అయినప్పటికీ కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల కొన్ని రాశులవారికి ఆశించిన పనులు కొద్దిగా ఆలస్యంగానైనా సానుకూలంగానే సాగుతాయి. నేడు బుధాదిత్య యోగ ప్రభావం కూడా బలంగా ఉంటుంది. నేడు ద్వాదశ రాశులవారి జాతకఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి
నేడు మేష రాశి వారికి బుధాదిత్య యోగం వల్ల వ్యాపారంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు ఉంటాయి.
వృషభ రాశి వారికి చంద్రుని అనుకూల స్థితి వల్ల ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. మీడియా, మార్కెటింగ్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి నేడు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలు సానుకూలంగా సాగుతాయి. ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కర్కాటక రాశి వారికి గురుడు స్వరాశిలోనే ఉచ్చస్థితిలో ఉంటూ అస్తమించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత ఎదుగుదలకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. సింహ రాశి వారికి గ్రహాల వ్యయ స్థాన సంచారం వల్ల ఈరోజు శ్రమ ఖర్చు ఎక్కువగా ఉంటాయి. అనవసరపు విషయాలు తలపిస్తే ఇబ్బంది ఎదురవుతుంది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. కన్యా రాశి వారికి ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. ఎప్పటినుండో నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. తులా రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి సానుకూల వార్తలు అందుతాయి. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. వృశ్చిక రాశి వారికి అదృష్టం బలంగా కలిసి వస్తుంది. ఉన్నత విద్య లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అనుకూల సమయం. సుదూర ప్రయాణాలు లాభిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ధనుస్సు రాశి వారికి ఈరోజు పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. మకర రాశి వారికి ఉద్యోగంలో, వ్యాపార భాగస్వామ్యాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. నూతన పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి. కుంభ రాశి వారికి కోర్టు వ్యవహారాలు లేదా పాత వివాదాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పనితీరు మెరుగ్గా ఉంటుంది. రుణాలు తీరిపోయే మార్గాలు కనిపిస్తాయి. మీన రాశి వారికి సృజనాత్మక మరియు కళా రంగాలలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. సంతానం వల్ల కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.వృషభరాశి
మిధునరాశి
కర్కాటకరాశి
సింహరాశి
కన్యారాశి
తులారాశి
వృశ్చికరాశి
ధనుస్సురాశి
నేటినుండి గజకేసరి రాజయోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులవుతారు!
మకరరాశి
కుంభరాశి
మీనరాశి