ఆగస్ట్ 6 2026 గురువారం నాడు గురువుకు అంకితం అయిన రోజు. ఈ రోజు బుధ, సూర్య, గురులు కలిసి త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. అత్యంత శక్తివంతమైన ఈ త్రిగ్రాహి యోగం అన్ని రాశులవారి జీవితంపైన ప్రభావాన్ని చూపిస్తున్నప్పటికీ, కొన్ని రాశులవారికి మాత్రం చాలా కలిసివస్తుంది. నేడు ద్వాదశ రాశులవారి జీవితం ముఖ్య గ్రహాల సంచారంతో, శక్తివంతమైన యోగంతో ఏ విధంగా ఉండబోతుంది? అనేది తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశి జాతకులకు నేడు చాలా అనుకూలమైన రోజు. వీరికి నేడు ఉద్యోగంలో లాభాలు ఉంటాయి. డబ్బు విషయంలో ఎవరికీ అప్పు ఇవ్వద్దు. కష్టపడి పనిచేసేవారికి ఫలితం ఉంటుంది. మాటల ద్వారానే సమస్యలు పరిష్కరించండి.
గురు గ్రహ అనుగ్రహంతో వృషభ రాశి వారు ఈ రోజు చేసే పనులలో విజయాలను సాధిస్తారు. వ్యాపారస్తులు చట్ట విరుద్ధమైన పనులు చేయకూడదు. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పనులు మెప్పు పొందుతాయి. మిధున రాశి వారికి గురు గ్రహ అనుగ్రహం ఉంటుంది. వీరికి పనులలో అపార లాభాలు వస్తాయి. పాత స్నేహితుల నుండి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. అవసరానికి మించి ఖర్చు చేయకూడదు. కర్కాటక రాశి వారి పైన గురు గ్రహ ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. అన్ని పనులు అడ్డంకులు లేకుండా జరుగుతాయి. దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం తగ్గుతుంది. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. సింహ రాశి వారికి నేడు అదృష్టం కలిసి వస్తుంది. గురుడి అనుగ్రహంతో లాభాలు వస్తాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఆశించవచ్చు. అధికారుల మాటలు నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మంచిది. పట్టించుకోకపోతే అనవసరంగా నష్టం వస్తుంది. కన్యా రాశి వారు సానుకూల ఆలోచన ఉన్న వారితో ఎక్కువ సమయం గడిపితే మంచిది. దుఃఖంతో ఉండే వాళ్ళ నుండి దూరంగా ఉండాలి. డబ్బు విషయంలో నేడు మంచి రోజు. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. నేడు తులా రాశి వారికి చాలా అనుకూలమైన రోజు. పనిచేసే చోట మీ ప్రతిభను చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన ప్రాజెక్టులలో భాగం కావచ్చు. వ్యాపారస్తుల ఆర్థికస్థితి బలపడుతుంది. పెద్ద ఎత్తున చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. తులా రాశి వారి సౌకర్యాలు పెరుగుతాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండా వృశ్చిక రాశి వారి పనులు పూర్తవుతాయి. ప్రైవేట్ కంపెనీలో పని భారం ఎక్కువగా ఉండొచ్చు కానీ శ్రమ వృధా కాదు. త్వరలోనే పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. ధనుస్సు రాశి వారికి ఉద్యోగ స్థలంలో లబ్ది జరుగుతుంది. గతంలో చేసిన పనికి తగిన ఫలం లభిస్తుంది. ఏం పని చేసిన విజయం ఖాయంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయం గడపవచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. మకర రాశి వారికి అన్ని పనులు రెడీ అవుతాయి. నేడు ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. అధిక పని ఒత్తిడిని నివారిస్తే మంచిది. డబ్బు విషయంలో మంచి రోజు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. నేడు కుంభ రాశి వారికి నిదానంగా ఉండే రోజు. పనిలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. అనవసర చర్చల్లో సమయం వృధా చేయ కూడదు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పని ప్రారంభిస్తే అదృష్టం కలిసి వస్తుంది. మీన రాశి వారికి నేడు సవాళ్లతో కూడిన రోజు. అనవసర వాదనలకు మీన రాశి వారు దూరంగా ఉండాలి. వర్తక వ్యాపారాలు చేసేవారు తెలివైన నిర్ణయాలను తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి ప్రగతి ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.వృషభ రాశి
మిధున రాశి
కర్కాటక రాశి
సింహరాశి
కన్యారాశి
తులారాశి
వృశ్చిక రాశి
ధనస్సు రాశి
మకర రాశి
కుంభరాశి
బుధాదిత్య యోగం మొదలైంది.. 22రోజులు ఈ రాశులు పట్టిందల్లా బంగారం అవుతుంది!
మీన రాశి