ఆగస్ట్ నెలంతా వీరికి జాక్ పాట్ ప్రకటించిన విలాసాల అధిపతి!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదలకు అధిపతి, విలాసాలకు కారకుడు, ప్రేమకు మూలమైన శుక్రుడు ఆగస్టు ఒకటి 2026 శనివారం ఉదయం 9 గంటల 24 నిమిషాలకు సింహరాశి నుండి కన్య రాశిలోకి సంచారం చేయమన్నాడు. బుధుడు అధిపతి అయిన కన్య రాశిలో శుక్రుడు నెలరోజుల పాటు సంచారం చేసి ఆపై, తన సొంత రాశి అయిన తులారాశిలోకి మారనున్నాడు.

Advertisement

ఈ రాశులవారికి లక్ ప్రకటించిన విలాసాల అధిపతి

శుక్రుడు కన్య రాశిలో సంచరించే సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. వీరు ఈ సమయంలో నక్కతోక తొక్కినట్టు లక్కీ ఫెలోస్ అవుతారు. శుక్ర సంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Advertisement

వృషభ రాశి

ఆగస్టు 1వ తేదీ నుంచి శుక్ర సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. దీనివల్ల మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థికపరంగా ఊహించని ధన లాభం పొందే అవకాశం ఉంటుంది.

ధనుస్సు రాశి

ఆగస్ట్ 1వ తేదీ నుండి ధనుస్సు రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. వర్తక, వాణిజ్యాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారి పనితీరు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతుంది. పెండింగ్ లో ఉన్న బాధ్యతలు చేపట్టటంతో పాటు, పెండింగ్ లో ఉన్న ముఖ్యమైన ఒప్పందాలు కూడా విజయవంతం అవుతాయి.

Advertisement

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుండో రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. ఈ సమయం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారికి సానుకూల సమయం. వీరికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

తెలంగాణాలో అటవీ అందాలు, నదులపై వంతెనలతో సాగే కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే

మకర రాశి

శుక్ర సంచారం మకరరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మకరరాశి వారు పడిన ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. వర్తక, వ్యాపారాలు చేసేవారికి శుభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు చేసేవారికి ధనలాభం కలుగుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే ప్లాన్ చేసుకుంటారు.

English Summary

Venus transit into Virgo on August 1, 2026. Know how this transit will benefits some zodiac signs. taurus, sagittarius, scorpio and capricorn will get luck and jackpot with venus.