ఆగస్ట్ 1 వరకు ఈ రాశులవారికి జాక్ పాట్.. శుక్ర సందేశం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అత్యంత శుభ గ్రహంగా భావించే శుక్రుడి సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 2026 జూలై 4వ తేదీ రాత్రి సుమారు 7:14 గంటలకు కర్కాటక రాశిని వీడి, సింహ రాశిలోకి ప్రవేశించాడు శుక్రుడు. దాదాపు ఆగస్టు 1వతేదీ వరకు శుక్రుడు సింహరాశి లోనే సంచారం కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులకు కారణం కానుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయంలో విశేష ధన యోగం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.

Advertisement

సింహ రాశిలో శుక్రుడి సంచారంతో సానుకూలంగా ఉండే రాశులు

ప్రేమ, ఐశ్వర్యం, సౌందర్యానికి కారకుడైన శుక్రుడి అనుగ్రహం వల్ల ఆయా రాశుల వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సింహ రాశిలో శుక్రుడి సంచారం వల్ల సానుకూలంగా ఉండే రాశులకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు, ధనలాభం కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ సంచారం వల్ల అదృష్టం వరించే ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.

Advertisement

మేషరాశి

మేష రాశి జాతకులకు శుక్ర సంచారం కారణంగా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాలు చేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మేష రాశి జాతకులకు ఈ సమయంలో విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి.

సింహరాశి

సింహ రాశి వారికి ఈ సంచార ప్రభావంతో ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు లభించి కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి వ్యాపార రంగంలో ఊహించని లాభాలు వస్తాయి. నూతన ఆదాయ మార్గాలు అన్వేషించే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సైతం ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

Advertisement

తులా రాశి

తుల రాశి జాతకులకు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ కాలంలో పాత బాకీలు వసూలు కావడంతో పాటు చేతికి భారీగా డబ్బు అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి శ్రమకు తగ్గ గుర్తింపు, జీతాల పెంపు వంటి శుభవార్తలు వినిపిస్తాయి. వైవాహిక జీవితంలో చాలా కాలంగా ఉన్న మనస్పర్థలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శుక్ర సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆగస్టు 1వ తేదీ వరకు వృశ్చిక రాశి వారు ఏ పని చేసిన కలిసి వస్తుంది. వ్యక్తిగత వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ప్రణాళికాబద్దంగా తీసుకుంటే మంచి జరుగుతుంది. ఇది వృశ్చిక రాశి శుభాలను చేకూరుస్తుంది.

Advertisement

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులు శుక్ర సంచారంతో లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. విలాసాలకు డబ్బులు ఖర్చు చేస్తారు. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఇది ధనుస్సు రాశి వారికి శుభకాలం.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

English Summary

Venus will stay in leo from july 4th to august 1st. promises massive financial windfalls for select zodiac signs. these zodiacs will get dhana yoga happiness and good fortune.