కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ న్యూస్.. అమరావతిలో రూ.1083కోట్లతో మీకోసం!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యాధునిక గృహ సముదాయం నిర్మించడానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారికి మెరుగైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన నివాస వసతులు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఉద్యోగుల కోసం చేపట్టిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఒక వెయ్యి 83 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో ఈ గృహ సముదాయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 28 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Advertisement

11 హై రైజ్ టవర్లతో అత్యాధునికంగా గృహ సముదాయాల నిర్మాణం

ఈ ప్రాజెక్టులో మొత్తం 11 హై రైజ్ టవర్లు ఉంటాయని వీటిలో 1504 నివాస యూనిట్లు నిర్మించబడతాయి అని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నివాస భవనాలకు అనుబంధంగా జి ప్లస్ ఫోర్ అంతస్తులు సహాయక భవనం, అతిథి గృహం, కమ్యూనిటీ హాల్, వంటగది, డైనింగ్ హాల్, షాప్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అదనంగా కామన్ డబుల్ లెవెల్ బేస్మెంట్ పార్కింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందన్నారు.

గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ ప్రకారం నిర్మిస్తున్నట్టు చెప్పిన మంత్రి పెమ్మసాని

ఇవన్నీ గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ ప్రకారం అందుబాటులో ఉంటాయని, వాటికి అనుగుణంగా రూపొందించబడతాయి అని మంత్రి స్పష్టం చేశారు. ఈ భవనాల నిర్మాణానికి అర్హత కలిగిన బిడ్ ల కోసం ఈనెల 12వ తేదీన హైదరాబాద్లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. సమావేశంలో ప్రాజెక్టు వివరాలు, నిబంధనలు, సాంకేతిక అంశాల పైన చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.

Advertisement

రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలకమైన అడుగు

ఇలాంటి పెద్ద ఎత్తున గ్రహ సముదాయ నిర్మాణం రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలకమైన అడుగుగా ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థానికంగా నివాస సౌకర్యాలు అందుబాటులోకి రానున్న క్రమంలో వారి కుటుంబాలకు అత్యంత సౌకర్యవంతంగా ఈ గృహ సముదాయం ఉండబోతుందన్నారు.

విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్.. త్వరలో భూసేకరణ, రూట్లు ఇవే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

అలాగే ఏపీ రాజధాని అమరావతి యొక్క మౌలిక వసతులను బలోపేతం చేసినట్టు అవుతుంది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే ప్రాజెక్టును అమలు చేస్తున్నట్టు తెలిపారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త గా చెప్పొచ్చు.

English Summary

Amaravati news: Tender process begins for a state-of-the-art housing complex for central government employees in Amaravati. 11 high-rise towers with 1,504 units, modern amenities, green building standards, estimated cost ₹1,083 crore, to be completed in 28 months.