ఏపీలో ప్రయోగాత్మకంగా ఆ పథకం.. గుజరాత్ మోడల్ లో .. లబ్దిదారులకు పండుగే!

పౌరసరఫరాల వ్యవస్థలో పారదర్శకతను పెంచడం కోసం, లబ్ధిదారులకు మరింత సౌకర్యాన్ని కల్పించడం కోసం ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. గుజరాత్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Advertisement

డిజిటల్ కరెన్సీ ద్వారా లబ్ధిదారులకు కావలసిన సరుకులు

పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ మరియు అహ్మదాబాద్ నగరాలలో ఈ పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి అక్కడ అధికారులతో సమావేశాలు నిర్వహించి అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ డిజిటల్ కరెన్సీ ద్వారా లబ్ధిదారులకు కావలసిన సరుకులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకొని కొనుగోలు చేసుకునే వీలు కల్పించారు.

Advertisement

తమకు కావాల్సిన సరుకులు తక్కువ ధరలో

పౌరసరఫరాల వ్యవస్థలో సరుకులకు పరిమితం కాకుండా అవసరానికి తగినట్టుగా వస్తువులు తీసుకోవడానికి ఈ విధానం ద్వారా అవకాశం ఉంటుంది. డిజిటల్ చెల్లింపుల ద్వారా లబ్ధిదారులు సౌకర్యాన్ని పొందవచ్చు. తమకు కావాల్సిన సరుకులు తక్కువ ధరలో ఈ వ్యవస్థ నుండి కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పథకం పైన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పౌరసరఫరాల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది అన్నారు.

విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం

లబ్ధిదారులు తమ ఇష్టానికి తగినట్టుగా సరుకులను కొనుగోలు చేసుకోవచ్చు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలలో మొదట ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా పేర్కొన్నారు . గుజరాత్ లో ఈ ప్రాజెక్టు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న కారణంగా ఏపీలో కూడా అదే మోడల్ అనుసరించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ సరికొత్త ఆధునిక సాంకేతికత ద్వారా పేదల పేదలు మరియు లబ్ధిదారులకు మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

English Summary

Andhra Pradesh to implement CBDC pilot project for Public Distribution System. Minister Nadendla Manohar visited Gujarat to study the digital rupee model. Plan to launch in Vijayawada and Visakhapatnam.