ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతున్న అన్నా కొణిదెల!

రాజకీయాలలోనే కాదు సామాజిక బాధ్యతలోనూ ఆదర్శంగా ఉండే వ్యక్తి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆదర్శ భావాలతో రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలో బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ కు ఆయన బాటలో నడిచే, ఆదర్శ భావాలు ఉన్న సతీమణి అన్నా లెజినోవా.

Advertisement

ఈ విషయాలలో పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతున్న అన్నా లెజినోవా

రష్యన్ మహిళ అయిన అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న నాటినుండి ఇప్పటివరకు ఆయన బాటలోనే నడుస్తున్నారు. ఆధ్యాత్మికత లోను, సామాజిక సేవలోనూ, వన్యప్రాణుల సంరక్షణ లోను, సంస్కృతీ, సాంప్రదాయాలను ఆచరించటంలోనూ, ధర్మ బడ్డ జీవనాన్ని అనుసరించటంలోనూ ఆమె పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతుంది.

Advertisement

ఏనుగు, పులి సంరక్షణ కోసం దత్తత తీసుకున్న అన్నా లెజినోవా

ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా అన్నా లెజినోవా విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ లో ఏనుగు, పులి సంరక్షణ కోసం వాటిని దత్తత తీసుకోవడం వన్యప్రాణుల సంరక్షణ పట్ల ఆమె కమిట్మెంట్ ను స్పష్టం చేస్తుంది. ఈ జంతువుల దత్తత కార్యక్రమం ద్వారా ప్రజలలో వన్యప్రాణుల పైన ప్రేమ, బాధ్యతను పెంపొందించడానికి పవన్ సతీమణి తన వంతుగా కృషి చేశారు.

ప్రకృతి ప్రేమికురాలు.. వన్యప్రాణులపై ప్రేమ ఉన్న అన్నా లెజినోవా

ప్రకృతిని ప్రేమించే వ్యక్తిగా, వన్యప్రాణుల సంరక్షణ పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కు పేరుంది. ఆయన సతీమణిగా అన్నా లెజినోవా కూడా ప్రకృతి ప్రేమికురాలు. అడవులు, జంతువులు, పర్యావరణ పరిరక్షణ పైన ఆమెకు ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె జూలో భారతదేశ జాతీయ వారసత్వ జంతువైన ఆసియా ఏనుగు సంరక్షణ, సంపూర్ణ పోషణ, వైద్య అవసరాల కోసం నాలుగు లక్షల 30 వేల రూపాయలను విరాళంగా అందించారు.

Advertisement

రెండు వన్య ప్రాణులను దత్తత తీసుకున్న పవన్ సతీమణి

భారతదేశ జాతీయ జంతువైన రాయల్ బెంగాల్ పులి దత్తత కోసం మరొక రెండు లక్షల రూపాయలు విరాళాన్ని అందించారు. మొత్తం ఈ రెండు వన్యప్రాణుల సంరక్షణ కోసం సంవత్సరానికి అయ్యే ఖర్చు ఆరు లక్షల 30 వేల రూపాయలను ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు అన్నా లెజినోవా అందించారు.

10 కోట్ల మందితో దేశవ్యాప్త ఉద్యమం.. మీరూ కలిసి రావాల్సిందే!

సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ భార్యకు ప్రశంసల జల్లు

పవన్ కళ్యాణ్ సతీమణి చేసిన ఈ చర్యకు సోషల్ మీడియాలో ఆమె పైన ప్రశంసల జల్లు కురుస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే ఆయనను మించిన గొప్ప ఔదార్యవంతురాలు అన్నా లెజినోవా అని పలువురు కొనియాడుతున్నారు. ఆమె రష్యన్ అయినా ఆమె సోల్ ఇండియన్ అని, దయాగుణంలో ఆమెకు ఆమెనే సాటి అంటున్నారు.

English Summary

Anna Konidela in pawan kalyan path: Anna Lezhneva, wife of Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan, won appreciation by adopting wild animals at Visakhapatnam Zoo. Her love for wildlife and commitment to conservation have inspired many.