ఏపీలో ప్రతి 150 కి.మీ పరిధిలో ఒక విమానాశ్రయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఏపీలో ఏవియేషన్ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని విమానాశ్రయాల నిర్మాణానికి పక్కా ప్రణాళికతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది.

Advertisement

విమానాశ్రయ విస్తరణకు సంబంధించి కీలక విషయాలపై చర్చ

దీంట్లో భాగంగా ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయి కీలక చర్చలు జరిపారు. రాబోయే 20 సంవత్సరాలలో రాష్ట్రం ఎదుర్కొనే ప్రయాణ అవసరాలను, ఆర్థిక అభివృద్ధిని, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి విమానాశ్రయ విస్తరణకు సంబంధించి అనేక కీలక విషయాలపై చర్చించారు.

Advertisement

రాష్ట్రంలో విమానయాన అభివృద్ధిపై చర్చించిన మంత్రి

రాష్ట్రంలో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయము ఉండేలా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి నగరాల వరకు విమానయాన సౌకర్యం సులభంగా అందుబాటులోకి తేవడం ఈ ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. కొత్త విమానాశ్రయాలు నిర్మించడం, ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను మెరుగుపరచడం, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసులను పెంచడం వంటి అనేక అంశాల పైన కేంద్రమంత్రితో వివరంగా చర్చించారు.

వేగంగా కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి

ముఖ్యంగా ఈ చర్చలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు అనుమతులు వేగంగా ఇవ్వాలని పేర్కొన్నారు. పుట్టపర్తి సమీపంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కోసం ప్రత్యేక ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ క్లస్టర్ అభివృద్ధి చేయాలని కోరారు. నదులు మరియు జలాశయాలలో పది ప్రాంతాలలో వాటర్ ఏరో డ్రోమ్ లు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హెలి పోర్టుల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించాలని కోరారు.

Advertisement

విమానయాన రంగ అభివృద్ధి సాధ్యమైతే ఉపాధి అవకాశాలు

జాయింట్ వెంచర్ల ద్వారా స్థానిక విమానాశ్రయాలను ఆధునీకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధి సాధ్యమైతే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వర్తక వాణిజ్యాలకు, పర్యాటకానికి ఊతం లభిస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అయితే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మంచి బీసీ జనార్దన్ రెడ్డి చర్చించిన అంశాల పైన సానుకూలంగా స్పందించారు.

English Summary

ap aviation development: Andhra Pradesh Minister BC Janardhan Reddy discussed aviation development with Union Minister Ram Mohan Naidu. Plans include new airports every 150 km, seaplane services, heliports and flight training facilities for the next 20 years.