వివాహేతర సంబంధాలు.. ఉదయం నిద్ర లేచిన దగ్గరనుంచి నిద్ర పోయేదాకా నిత్యం అనేక వివాహేతర సంబంధాలకు సంబంధించి ఘటనలు వార్తలలో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. వివాహేతర సంబంధంతో భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త , కొడుకును చంపిన తల్లి ఇలా ప్రతిరోజు అనేక ఘటనలను చూస్తున్నాం. సమాజంలో నైతిక విలువలు కొరవడడం కారణంగా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఇవి అనేక హత్యలకు కారణమవుతున్నాయి.
వివాహేతర సంబంధాల పర్యవసానం తెలిపే ఘటన
ముఖ్యంగా వివాహితలను క్రిమినల్స్ గా తయారు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు దారుణ ఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా అనంతపురం నగరంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన వివాహేతర సంబంధాల పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో అర్థమయ్యేలా చెబుతుంది. ఒక వివాహిత ప్రియుడి నుండి తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా దారుణ నేరానికి పాల్పడింది.
పోలీసులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం అనంతపురంలోని డ్రైవర్స్ కాలనీలో సునీత అనే వివాహిత, తాడిపత్రికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ తో గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తోంది. అయితే ఇటీవల సురేష్ మద్యం మత్తులో సునీత కూతురు పైన కూడా అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత తల్లిగా కూతుర్ని రక్షించుకోవాలని ఉంది కత్తితో సురేష్ మర్మాంగాన్ని కోసేసింది. తల్లికి కూతురు కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సునీత స్వయంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయింది.పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి బాధితుడితో పాటు సునీత, ఆమె కుమార్తె వాంగ్మూలాలను నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సునీత కూతురితో అసభ్య ప్రవర్తన, దాడికి దారి తీసిన పరిస్థితుల పైన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతోంది. ఈ ఘటన అనంతపురంలో ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. వివాహేతర సంబంధాల ప్రభావం కుటుంబంలో పిల్లలపైన ఏ విధంగా ఉంటుంది అనేదానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది.ప్రియుడి మర్మంగాన్ని కోసేసిన వివాహిత
పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సునీత
తెలంగాణలో మరో కొత్త రైల్వేలైన్.. భద్రాచలానికి నేరుగా.. భక్తులకు పండుగే!
దాడికి దారి తీసిన పరిస్థితులపైన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు