డ్వాక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్..! ఛార్జీల మాఫీ, వడ్డీ రేటు తగ్గింపు..!

ఏపీలో స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు ప్రభుత్వం (AP Govt) మరో శుభవార్త చెప్పింది. డ్వాక్రా సంఘాల ద్వారా ప్రభుత్వం నుంచి సాయం పొందుతున్న మహిళలకు మరింత లబ్ది కలిగే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా గ్రామీణ బ్యాంకుల్లో భారంగా మారిన సర్వీస్ ఛార్జీలతో పాటు రుణాలపై వడ్డీ రేట్ల నుంచి ఊరట కల్పించింది. దీంతో డ్వాక్రా సంఘాల మహిళలు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Bhogapuram Airport: భోగాపురం క్రెడిట్ వారిదే ? ఆధారాలతో తేల్చేసిన మాజీ ఇంటెల్ ఛీఫ్ ..!
Advertisement

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకుల్లో స్వయం సహాయక సంఘాల రుణాలపై అన్ని సేవా ఛార్జీల్ని మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే రూ.5 లక్షలు పైబడిన స్వయం సహాయక సంఘాల రుణాలపై వడ్డీని 13% నుంచి 12%కు తగ్గించారు. సీఎం చంద్రబాబు చొరవ, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కృషితో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో గ్రామీణ బ్యాంకుల్లో ఇకపై రుణాలు మరింత సులభతరం కానున్నాయి.

మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారానికి చెక్ - మరోసారి తేల్చిచెప్పిన ఏపీ సర్కార్..!
Advertisement

ప్రభుత్వం గ్రామీణ బ్యాంకుల్లో రద్దు చేసిన వాటిలో రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్, ఇన్‌స్పెక్షన్, పాస్‌బుక్, లెడ్జర్, క్యాష్ హ్యాండ్లింగ్ వంటి ఛార్జలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీ స్వయం సహాయక సంఘానికీ ఏడాదికి 25 వేల వరకూ లబ్ది కలుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే గ్రామీణ బ్యాంకుల్లోని సుమారు 2.75 లక్షల మహిళా సంఘాలకు భారీ ప్రయోజనం కలుగుతుందని అంచనా. ఇప్పటికే డ్వాక్రా సంఘాల్ని బలోపేతం చేయడంతో పాటు వారి ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మార్కెటింగ్ కల్పించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.