ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో (Mega Dsc 2025) అక్రమాలు జరిగాయంటూ గత కొంతకాలంగా వరుస ఆరోపణలు చేస్తున్న వైఎస్సార్సీపీ (YSRCP).. దీనిపై సీబీఐ దర్యాప్తుకు కూడా డిమాండ్ చేస్తోంది. అలాగే నిరసనలు కూడా చేపడుతోంది. ఇదే క్రమంలో మెగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో (AP High Court) ప్రజా ప్రయోజన వాజ్యం కూడా దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు ? జగన్ డిమాండ్..!
మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగినందున సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్ పర్వతరెడ్డి ఆరోపిస్తున్నట్లుగా డీఎస్సీలో స్పోర్ట్ కోటా వల్ల నష్టపోయిన అభ్యర్ధులు నేరుగా కోర్టుకు ఎందుకు రావడం లేదని హైకోర్టు నిలదీసింది. దీనికి పిటిషనర్ న్యాయవాది వారు భయపడుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు.
మెగా డీఎస్సీ నోటిపికేషన్ తో పాటు నియామకాలను సవాల్ చేస్తూ ఇప్పటివరకూ 335 పిటిషన్లు దాఖలైనట్లు హైకోర్టు తెలిపింది. దీనిపై ఇప్పటికే విచారణ జరుగుతోందని గుర్తుచేసింది. ఇప్పుడు వైసీపీ దాఖలు చేసిన పిల్ పై స్పందిస్తూ...ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది చాలా విలువైన సాధనమని తెలిపింది. రాజకీయ ప్రయోజనాల కోసం పిల్ ను వాడుకునేందుకు అనుమతిస్తే దాని ఉద్దేశం దెబ్బతింటుందని పేర్కొంది. కాబట్టి ఈ పిల్ పై వాదనలు వినిపిస్తారా లేక ఉపసంహరించుకుంటారా అని పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో పిటిషనర్ అభిప్రాయం తీసుకుని హాజరవుతామని ఆయన కోర్టుకు తెలిపారు.జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ హల్‌చల్..! భార్యతో కలిసి..!