ఏపీకి చల్లని కబురు..మారిన వెదర్, నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!

దేశవ్యాప్తంగా ఎల్ నినో పరిస్థితుల కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ అనేక రాష్ట్రాలలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేలా వర్షాలు కురుస్తున్నాయి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు లేటెస్ట్ వెదర్ అప్డేట్ ను ఇచ్చింది.

Advertisement

ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం

ఈ రోజు రాష్ట్రంలోని అనేక జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువగా నమోదు కావచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వర్షాలు రైతులకు ఊరటనిస్తాయని పేర్కొంది.

Advertisement

ఈ జిల్లాలలో మోస్తరు వర్షాలు పడే సూచనలు

ఈరోజు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించిన మేరకు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా, చిత్తూరు జిల్లా, అమరావతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. తిరుపతి,బాపట్ల, పలనాడు, ప్రకాశం, నంద్యాల, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

లోటు వర్షపాతం నమోదు కావడంతో ప్రభుత్వాలు అలర్ట్

నిన్న బాపట్ల జిల్లా అద్దంకి, సత్యసాయి జిల్లా ఆగలి, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వంటి ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదయింది. ఈ సీజన్లో వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం ఇస్తున్నాయి. ఏదేమైనా దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం గత ఏడాది కంటే లోటు వర్షపాతం నమోదు కావడంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.

Advertisement
పోలవరం ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసే ముహూర్తం ఫిక్స్.. అది ఎవరూ మరచిపోని రోజు!

వర్షాల నేపథ్యంలో ప్రజలకు ముఖ్యమైన సూచనలు

ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రైతన్నలు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ అధికారులు వర్షాల నేపథ్యంలో ప్రజలకు ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు ఉన్న సమయంలో బయట చెట్ల కింద, ఎత్తైన స్థలాలలో నిలబడకూడదని చెబుతున్నారు. రైతన్నలు వర్షాల నేపథ్యంలో పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

English Summary

AP Rains: Andhra Pradesh is likely to receive moderate rains in several districts today including Vijayanagaram, Parvathipuram Manyam, and others. APSDMA has issued alerts for lightning and advised people to take precautions amid ongoing rainfall.