నేడు ఏపీ, తెలంగాణాలలో ఈ జిల్లాలలో వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక!

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వాతావరణం చల్లబడింది. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో, హైదరాబాద్ తో సహా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఎగువ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవడంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తాజా అంచనాలను విడుదల చేసింది.

Advertisement

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వర్షాలు

నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ వెల్లడించారు.

Advertisement

ఏపీలో ఈ జిల్లాలలో వర్షాలు

ఇదిలా ఉంటే నేడు మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాలలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణాలో ఈ జిల్లాలలో వర్షాలు

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనూ రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

ధవళేశ్వరం వద్ద తగ్గుతున్న గోదావరి ఉధృతి .. లంక గ్రామాలకు అలెర్ట్

ఈ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.మరోవైపు గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం వద్ద జారీ చేసిన రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లంక గ్రామాలలో వరద నీరు చేరడంతో, ప్రజలు వరద నీరు పూర్తిగా తగ్గేవరకు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచిస్తున్నారు.

ఏపీ ప్రజలకు తీపికబురు.. సబ్సిడీ ధరలకే బియ్యం అమ్మకాలు ప్రారంభం!
Advertisement

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మొత్తంగా గోదావరి, కృష్ణా నదికి వస్తున్న వరద కాస్త తగ్గుముఖం పట్టగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షాలు కురిసే జిల్లాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. ముఖ్యంగా రైతులు వర్షాలు కురిసే సమయంలో చెట్ల క్రిందకు వెళ్ళవద్దని చెప్తోంది.

English Summary

AP Telangana rains: IMD predicts light to moderate rains and thunderstorms in several districts of Andhra Pradesh and Telangana on Monday. Heavy rain likely in Manyam, Alluri and Polavaram. Godavari flood warning partially withdrawn at Dhavaleswaram.