పర్యాటకులకు శుభవార్త.. త్వరలో కృష్ణానదిలో మరింత ఆహ్లాదకర బోటింగ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏపీలో పర్యాటక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఏపీలో నదులు, సముద్ర తీర ప్రాంతాలు ఉన్నచోట పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఏపీలోని బీచ్ లపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే అభివృద్ధి చేస్తున్న సర్కార్, కృష్ణానదిలో పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని కలిగించడం కోసం డీజిల్ బోట్లకు బదులు సోలార్ శక్తితో నడిచే బోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

Advertisement

సోలార్ మెకనైజ్డ్ బోట్ లను కొనుగోలు చేయాలని నిర్ణయం

ఈ మేరకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏపీటీడీసీ బోర్డు సమావేశంలో సోలార్ బోటు నమూనాను కూడా సభ్యులకు ప్రదర్శించారు. ప్రయోగాత్మకంగా ఏపీలో నాలుగు సోలార్ మెకనైజ్డ్ బోట్ లను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రాంతంలో కృష్ణా నదిలో పర్యాటకుల సేవ కోసం డీజిల్ తో నడిచే బోట్ లు వినియోగంలో ఉన్నాయి.

Advertisement

డీజల్ బోట్లతో ఈ ఇబ్బంది

డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతుంది. అంతే కాదు దీంతో జల కాలుష్యం కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సోలార్ తో నడిచే బోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీటీడీసీ నిర్ణయించింది. అయితే సాధారణ మెకనైజ్డ్ బోట్ ధర సుమారు 30 లక్షల రూపాయలు ఉంటే, సోలార్ మెకనైజ్డ్ బోటు ధర 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

రెండు నెలల కాలంలో అందుబాటులోకి సోలార్ బోట్లు

మొత్తం నాలుగు బోట్లను కొనుగోలు చేయాలని aptdc భావిస్తున్న క్రమంలో దీనికోసం రెండు కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. దీనికోసం టెండర్లను ఆహ్వానించి తక్కువ ధరకు నాణ్యమైన బోట్లను అందించే సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వనున్నారు. దాదాపు రెండు నెలల కాలంలో ఈ బోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనివల్ల జల కాలుష్యం తగ్గుతుంది.

Advertisement

ప్రయోగం సక్సెస్ అయితే అన్ని చోట్లా సోలార్ బోట్లు

శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే బోటింగ్ సౌకర్యం ఉన్న అన్ని చోట్లా డీజిల్ బోట్లకు బదులు సోలార్ బోట్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ప్రభుత్వం పర్యాటకులకు మంచి పర్యాటక అనుభవం అందించటం కోసం పని చేస్తూనే, ఇదే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించటంపైన కూడా దృష్టి సారిస్తుంది.

English Summary

AP Tourism: The AP government has good news for tourists. It plans to introduce solar-powered boats instead of diesel boats on the Krishna River to provide tourists with a more pleasant travel experience.