AP Weather: ఏపీకి వాయుగండం- రేపు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కనిపిస్తోంది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు (Rain) కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో వాయుగుండం విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాబట్టి ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement
మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారానికి చెక్ - మరోసారి తేల్చిచెప్పిన ఏపీ సర్కార్..!
Advertisement

వాయుగుండం ప్రభావంతో రేపు (శుక్రవారం) మన్యం, అల్లూరి, పోలవరం,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Monsoon Cloud: వర్షాన్ని మోసుకొస్తున్న భారీ మేఘం-ఏకంగా 10 వేల కిలోమీటర్ల పొడవు..!

ఆయా జిల్లాల్లో వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం హెచ్చరిస్తోంది. కాబట్టి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని ప్రజలకు సూచిస్తోంది. ఇప్పటికే వర్షాల కారణంగా పలు చోట్ల జనజీవనానికి అంతరాయం కలుగుతోంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.