భోగాపురం విమానాశ్రయంలో ఉద్యోగాలపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన

విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు ఒకటవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవాన్ని జరుపుకుంది. ఈ విమానాశ్రయంలో ఈనెల 17వ తేదీ నుండి కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఇక ఈ సమయంలో భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, వైజాగ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రారంభోత్సవం రోజు వేదిక పైన స్క్రీన్ పై ప్రదర్శించారు.

Advertisement

భోగాపురం విమానాశ్రయంపై స్థానికంగా అనుమానాలు

ఈ క్రమంలో స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్ అని పేర్కొనటంపై, స్థానిక ఉద్యోగాల నేపధ్యంలో కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. వైజాగ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై వదంతులు వ్యాప్తి చెయ్యవద్దన్నారు.

Advertisement

వైజాగ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరుపై మంత్రి క్లారిటీ

సివిల్ ఏవియేషన్ అథారిటీ సూచనల మేరకు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ముందు వైజాగ్ అని పేర్కొనడం జరిగిందని, అంతమాత్రాన అది వైజాగ్ కు పరిమితం కాదని, విమానాశ్రయం భోగాపురం రెవిన్యూ పరిధిలో ఉందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి శంషాబాద్ విమానాశ్రయమని, హైదరాబాద్ విమానాశ్రయం అని అంటారని అంతమాత్రం చేత అది రంగారెడ్డి జిల్లాకు చెందింది కాకుండా పోదని పేర్కొన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ ఉద్యోగాలపైన మంత్రి చెప్పిందిదే

ఇక ఇదే సమయంలో విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగాల భర్తీపై ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు. విమానాశ్రయంలో 70 శాతం బ్లూ కాలర్ ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చామని మంత్రి తెలిపారు. వైట్ కాలర్ ఉద్యోగాల విషయంలో అర్హత, అనుభవం వంటి అంశాల ఆధారంగా నియామకాలు జరుగుతాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Advertisement
నిజామాబాద్ జిల్లా వాసులకు తీపికబురు.. త్వరలో జీజీహెచ్ లో సూపర్ స్పెషాలిటీ సేవలు!

ఉద్యోగాలపై అపోహలు వద్దన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ఉద్యోగాల విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని ఆయన సూచించారు. ఈ అంశంపై మరోసారి జీఎంఆర్ సంస్థతో చర్చిస్తామని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయం మరికొద్ది రోజుల్లో కార్యాకలాపాలు ప్రారంభించనున్న క్రమంలో ఉద్యోగాల కల్పన కొనసాగుతుంది.

English Summary

bhogapuram airport jobs: AP Minister Kondapalli Srinivas said that 70% of blue-collar jobs at Bhogapuram Alluri Sitarama Raju International Airport are reserved for locals. White-collar posts based on merit. Explains Vizag name usage as per Civil Aviation guidelines.