ఇది ఉత్తరాంధ్ర దెబ్బ... అర్థమైందా రాజా.. ప్రధాని మోదీ ముందే లోకేష్ షాకింగ్ స్పీచ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఆశగా ఎదురు చూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను భారత ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు.

Advertisement

ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా? అన్నవారికి దిమ్మతిరిగే సమాధానం

ఇక ఈ సభలో ఉత్తేజభరితంగా మాట్లాడిన మంత్రి నారా లోకేష్ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అంటూ కొందరు అన్నారని, ఉత్తరాంధ్రను తక్కువ చేశారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై చులకన భావంతో మాట్లాడిన వారికి, తక్కువగా అంచనా వేసిన వారికి ఈరోజు దిమ్మ తిరిగే సమాధానమే ఈ విమానాశ్రయం అంటూ అభిప్రాయపడ్డారు.

Advertisement

ఉత్తరాంధ్ర కలలకు మోడీ రెక్కలు ఇచ్చారన్న లోకేష్

ఎర్ర బస్సు రాదన్న చోటుకి ఎయిర్పోర్ట్ వచ్చిందని, ఎయిర్ బస్ వచ్చిందని, ఏకంగా మన నమో వచ్చారని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇది ఉత్తరాంధ్ర దెబ్బ... అర్థమైందా రాజా అంటూ లోకేష్ పవర్ ఫుల్ డైలాగ్ విసిరారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ ఉత్తరాంధ్ర కలలకు మోడీ రెక్కలు ఇచ్చారని కొనియాడారు.

ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్లే ఇదంతా

ఇది కేవలం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాదని, భారత ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్, సిబిఎన్ విజన్ కలిసిన రోజని కొనియాడారు. ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత కష్టాలలో ఉన్న ఏపీని ఆదుకున్నది ప్రధాని మోడీ అని అభిప్రాయపడ్డారు. ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్లే అమరావతికి నిధులు వచ్చాయని, పోలవరం, విశాఖ రైల్వే జోన్, ఉక్కు ప్లాంట్ రక్షణ, కర్నూలుకు హైకోర్టు బెంచ్ గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు సాధ్యం అయ్యాయని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు.

Advertisement
తెలంగాణలో మరో కొత్త రైల్వేలైన్.. భద్రాచలానికి నేరుగా.. భక్తులకు పండుగే!

ఉత్తరాంధ్రను రాష్ట్ర పవర్ ఇంజన్ గా మార్చే ఎయిర్ పోర్ట్

ఈ విమానాశ్రయ నిర్మాణం అనుకున్న దాని కంటే ముందుగానే జరిగిందని, జిఎంఆర్ రికార్డు సమయంలో విమానాశ్రయాన్ని నిర్మించి జన్మభూమి రుణం తీర్చు కుందని అన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన కృషిని లోకేష్ కొనియాడారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రను రాష్ట్ర పవర్ ఇంజన్ గా మారుస్తుందని, దీనివల్ల ఉద్యోగాలు ఎగుమతులు పరిశ్రమలు టూరిజం ఐటీ రంగాలకు బూస్ట్ వస్తుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

English Summary

bhogapuram airport: Nara Lokesh powerful speech at Bhogapuram International Airport inauguration. Strong counter to critics on Uttarandhra development. Full details here.