భోగాపురం వేదికపై ప్రధాని మోదీకి బొబ్బిలి వీణ.. దీని ప్రత్యేకతలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్రకు రెక్కలు వచ్చాయి. విజయనగరం జిల్లా భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ విమానాశ్రయం ద్వారా దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవనున్నాయి.

Advertisement

ప్రధాని మోడీకి బొబ్బిలి వీణ బహూకరించిన చంద్రబాబు

ఆగస్టు 17వ తేదీ నుండి భోగాపురం విమానాశ్రయ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని విమానాశ్రయాన్ని ప్రారంభించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర సాంస్కృతిక చిహ్నమైన బొబ్బిలి వీణను బహుమతిగా అందించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాంధ్ర సాంస్కృతిక చిహ్నమైన బొబ్బిలి వీణను బహూకరించిన క్రమంలో బొబ్బిలి వీణ యొక్క విశేషాలు అందరినీ అబ్బుర పరుస్తున్నాయి.

Advertisement

బొబ్బిలి వీణకు మూడు శతాబ్దాల చరిత్ర

ఆంధ్రప్రదేశ్ వారసత్వ కళలకు ప్రతీకగా బొబ్బిలి వీణను చెబుతారు. మూడు శతాబ్దాల చరిత్ర బొబ్బిలి వీణకు ఉందని, ప్రపంచవ్యాప్తంగా వాయిద్య సాధనం పేరు గడిచిందని చెబుతారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లి, వాడాడ గ్రామాలలోని విశ్వకర్మ కుటుంబాలు తరతరాలుగా ఈ వీణలను తయారు చేస్తున్నారని చెప్తున్నారు. ఇవి సాధారణ వీణల లాంటివి కావని, ఇవి చాలా ప్రత్యేకమైనవని, అటువంటి వీణను ప్రధాని మోదీకి బహూకరించినట్లు గా తెలుస్తోంది.

పనస చెట్టు ఒకే కాండంతో ఏకంద వీణ.. అదే బొబ్బిలి వీణ

సహజంగా చెక్కతో వీణలను తయారు చేస్తారు. చెక్క ముక్కలను ఒకదానికొకటి అతికిస్తూ వీణ రూపం తీసుకువస్తారు. కానీ బొబ్బిలి వీణ అలా ముక్కలుగా అతికించే కాదు. ఏ కలప పడితే ఆ కలపను వినియోగించేది కాదు. బొబ్బిలి వీణ పనస చెట్టు లోని ఒకే చెక్క నుండి తొలిచి రూపొందిస్తారు. ఎక్కడ అతుకులు లేకపోవడం వల్ల దీనిని ఏకంద వీణ అంటారు. దీని నుండి వచ్చే స్వరాలు చాలా స్పష్టంగా మృదువుగా మధురంగా ఉంటాయి. ఈ వీణ పైన సింహం ముఖం, తామర పూలు ఏనుగు దంతాల డిజైన్లు ఆకట్టుకుంటాయి.

Advertisement
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం వేళ వైఎస్సార్‌సీపీ వరుస ట్వీట్లు,!

బిల్ క్లింటన్ మెచ్చిన వీణ

2012లో భౌగోళిక గుర్తింపు గుర్తింపు పొందిన బొబ్బిలి వీణ తపాలా స్టాంపులు, నాణేల పైన ముద్రించబడింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ దీన్ని ఎంతో కొనియాడారు. g20 సదస్సు లోను, విశాఖ గ్లోబల్ సమ్మిట్ లోను దీనిని ప్రదర్శించారు . ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రపంచానికి చాటి ఈ కళాఖండాన్ని, దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్న ఈ అద్భుత వైద్య పరికరాన్ని నేడు ఏపీ సీఎం చంద్రబాబు భారత ప్రధాని నరేంద్ర మోడీకి అందించటం నిజంగా విశేషం.

English Summary

bobbili veena gift to pm modi: CM Chandrababu presented traditional Bobbili Veena to PM Modi at Bhogapuram Airport inauguration. Know the unique history and features of this Andhra musical instrument.