ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 నుంచి 2025 మధ్యకాలంలో 31 లక్షల 60 వేల అనర్హమైన, బోగస్ రేషన్ కార్డులను పౌరసరఫరాల శాఖ రద్దు చేసింది. సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు మాత్రమే అందాలనే లక్ష్యంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. గత ఐదు సంవత్సరాలలో ఈకేవైసీ, ఆధార్ సీడింగ్, వివిధ శాఖల లబ్ధిదారుల సమాచారంపై క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డులను తొలగించారు.
ఏపీలో భారీగా బోగస్ రేషన్ కార్డుల ఏరివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని గుర్తించి, అర్హులకు నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంది. అనర్హులు రేషన్ తీసుకోవడం వల్ల ప్రభుత్వ ఖజానాపైన అదనపు భారం పడుతుందని గుర్తించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అక్రమ రేషన్ కార్డును తొలగించాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నవారు, నిర్దేశించిన పరిమితికి మించి విద్యుత్ వినియోగిస్తున్న వారు, కార్లు వంటి నాలుగుచక్రాల వాహనాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, కుటుంబంలో సొంతఆస్తులు ఉన్నవారిని రేషన్ కార్డు వినియోగించుకోవడానికి అనర్హులుగా పరిగణించారు. అంతేకాదు మరణించిన వారి పేర్లు, వేరువేరు ప్రాంతాలలో డూప్లికేట్ గా రేషన్ కార్డులు తీసుకున్నవారు, పెళ్లిళ్ళు అయ్యి వెళ్లిపోయిన పిల్లల పేర్లను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా సిస్టమ్ నుండి తొలగించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానా పైన భారం తగ్గి, నిజమైన లబ్దిదారులకు రేషన్ చేరుతుంది. రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం, కందిపప్పు, చక్కెర వంటి సరుకులు అందుతున్నాయి. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు, విడిపోయిన కుటుంబాలు, అన్ని అర్హతలు ఉన్న నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ సాగుతోంది. రేషన్ కార్డులు రద్దు అయిన వారిలో నిజమైన లబ్ధిదారులు ఉంటే వారు తిరిగి వాటిని పునరుద్ధరించుకునేలా అవకాశం కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎవరైనా నిజమైన లబ్ధిదారులు, అర్హులు రేషన్ కోల్పోతే మరి సమయంలో సచివాలయాన్ని సంప్రదించి అవసరమైన పత్రాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని పత్రాలను పరిశీలించి తిరిగి వారి రేషన్ కార్డు పునరుద్ధరించే అవకాశం ఉంటుంది.అనర్హుల జాబితాలో వీరు
నిజమైన లబ్దిదారులకు రేషన్ చేరేలా ప్రభుత్వ నిర్ణయం
ప్రతి పేద కుటుంబానికి, నిజమైన లబ్ధిదారులకు రేషన్ అందాలని భావిస్తున్న క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సాంకేతిక పొరపాట్ల కారణంగా తమ రేషన్ కార్డులు రద్దు అయ్యాయని ఫిర్యాదు చేసిన అర్హులైన పేదలకు మళ్లీ వాటిని పునరుద్ధరించుకునే అవకాశం కల్పిస్తున్నారు.అన్ని అర్హతలు ఉన్నవారికి రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ
సామాన్యులకు చంద్రబాబు శుభవార్త..త్వరలో తక్కువ ధరలకు కందిపప్పు, వంటనూనెలు
నిజమైన లబ్దిదారులు రేషన్ కోల్పోతే ఇలా చెయ్యాలి