కుప్పం కు కంపెనీల క్యూ.. 40వేల మందికి ఉపాధి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకపడిన ప్రాంతం అయిన కుప్పం నియోజకవర్గం పారిశ్రామిక హక్కుగా రూపొందించడం చెందుతుంది. గతంలో తీవ్రమైన కడుపుతో అల్లాడిన ఈ నియోజకవర్గాన్ని ప్రగతి బాట పట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కరువు సీమ అయిన రాయలసీమలో ఇప్పటికే అనేక పెద్ద పెద్ద కంపెనీలను పెట్టేలా ఆహ్వానించిన చంద్రబాబు, కుప్పంలో కూడా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేలా చొరవ తీసుకున్నారు.

Advertisement

కుప్పం నియోజకవర్గం లో పెట్టుబడులు పెట్టేందుకు 30 కంపెనీలు

గడిచిన రెండేళ్ల కాలంలోనే సుమారు 30 కంపెనీలు కుప్పం నియోజకవర్గం లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దాదాపు తొమ్మిది వేల 332 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా ఇటీవల చంద్రబాబు నాయుడు రూ. 200 కోట్లతో ఏర్పాటు చేసిన ఏ బి ఐ ఎస్ పరిశ్రమను ప్రారంభించారు.

Advertisement

దాదాపు 40 వేల మందికి ఉద్యోగాలు

ఈ పరిశ్రమ ద్వారా 1400 మందికి పైగా స్థానికులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు లభించాయి. కంపెనీలు పెట్టుబడులు పెడుతున్న క్రమంలో వేలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే శంకుస్థాపన చేసిన పరిశ్రమల ద్వారా దాదాపు 40 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

బెంగుళూరుకు సమీపంలో ఉండటం ప్రధాన అనుకూలత

గుడిపల్లె మండలం పొగురు పల్లెలో అడిడాస్ సంస్థకు బూట్లు సరఫరా చేసే హ్వాసెంగ్ యూనిట్ ద్వారా దాదాపు 20వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. 2081 కోట్ల రూపాయలతో అధా గ్రూప్ బ్యాటరీ అనోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. కుప్పం భౌగోళికంగా బెంగుళూరుకు సమీపంలో ఉండటం కూడా ఇక్కడ పారిశ్రామిక ప్రగతికి ప్రధాన అనుకూలతగా మారింది.

Advertisement

1,200 ఎకరాల విస్తీర్ణంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం

రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచడంలో భాగంగా కుప్పం - మారికుప్పం రైల్వేలైన్ నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. అంతేకాదు రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో సుమారు 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి తన తదుపరి పర్యటనలో ఈ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.కుప్పానికి తాగునీటి, సాగునీటి సమస్య తీరింది. ఇప్పుడు పారిశ్రామిక ప్రగతితో కూటమి ప్రభుత్వ హయాంలో కుప్పం శరవేగంగా దూసుకుపోతుంది.

English Summary

kuppam industrial growth: In the last two years alone, approximately 30 companies have come forward to invest in the Kuppam constituency. They have expressed their willingness to make massive investments totaling nearly ₹9,332 crore. This is set to provide employment to 40,000 people.