విశాఖలో కాగ్నిజెంట్ సెజ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నిరుద్యోగులకు పండుగే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త. విశాఖపట్నంలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కొత్త ప్రత్యేక సెజ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది ఉత్తరాంధ్ర ప్రాంత యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

కాగ్నిజెంట్ సెజ్ కు గ్రీన్ సిగ్నల్ .. విశాఖ పారిశ్రామిక ప్రగతికి దోహదం

విశాఖపట్నం మధురవాడ ఐటి సెజ్ పరిధిలోని హిల్ నెంబర్ 2 లో ఈ క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంపస్ ఏర్పాటు కోసం గతంలోనే ప్రాధమిక అనుమతులు లభించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తుది ఆమోదం రావడంతో ప్రాజెక్టు పనులలో వేగం పుంజుకోనుంది. ఇప్పటికే మధురవాడ ప్రాంతంలో అనేక ఐటీసంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో కాగ్నిజెంట్ విస్తరణ విశాఖ పారిశ్రామిక ప్రగతికి దోహదం చేస్తుంది.

Advertisement

నిరుద్యోగ యువతకు ఉపాధి.. వీరికి లబ్ది

విశాఖలో ఈ సెజ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లకు, కొత్తగా చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం చూసే ఫ్రెషర్ లకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇతర రాష్ట్రాలకు నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుంది.

అంతర్జాతీయ సంస్థలు విశాఖపట్నం వైపు చూడడం గుడ్ సైన్

ఏది ఏమైనా విశాఖను ఐటీ హబ్ గా ప్రభుత్వం అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సంస్థలు విశాఖపట్నం వైపు చూడడం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బలాన్ని ఇస్తుంది. కాగ్నిజెంట్ వంటి ప్రపంచ స్థాయి సంస్థ విశాఖకు రావడంతో మరిన్ని సంస్థల స్టార్టప్ లు విశాఖ వైపు చూసే అవకాశం ఉంటుంది.

Advertisement

ఏపీ ఆర్ధిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళే ప్రాజెక్ట్

మౌలిక సదుపాయాలు, రవాణా, ఇంటర్నెట్ ఫెసిలిటీ వంటి అంశాలలో మెరుగుదల ఈ ప్రాంతంలో ఐటీ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఏపీ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. విశాఖ ఐటీ సెక్టార్ వృత్తి చెందడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. ఇది ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలకమవుతుంది. రాబోయే రోజులలో విశాఖలో మరిన్ని ఐటీ సంస్థలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది యువతకు ఉపాధి, రాష్ట్రానికి ఆర్థిక ప్రగతిని కలిగిస్తుంది

English Summary

Cognizant sez in visakha: cognizant gets approval for new SEZ in Visakhapatnam's Madhurawada. The project is set to create thousands of jobs for local youth and boost the IT sector in AP.