గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ.. పవన్ కళ్యాణ్ ఫోకస్, ఏం చేస్తున్నారంటే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడం పైన డిప్యూటీ సీఎం, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ ప్రాజెక్ట్ ను చేపట్టింది. తాజాగా ఈ పనుల పైన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు.

Advertisement

గ్రేట్ గ్రీన్ వాల్ లక్షల సాధనలో నిర్లక్ష్యం వద్దన్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని రక్షించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని తదనుగుణంగా సూచనలు చేశారు. డివిజన్ వారీగా నిర్దేశించిన లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి? ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారు? మడ అడవుల విస్తీర్ణం ఎంత పెరిగింది? వంటి వివరాలను తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రేట్ గ్రీన్ వాల్ లక్షల సాధనలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు.

Advertisement

వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా అదనంగా 70 లక్షల మొక్కలు

వీబీ జీ రాం జీ పథకం కింద తీర ప్రాంత జిల్లాలకు అదనంగా 70 లక్షల మొక్కలను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. మడ అడవులు విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానం సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందున సంబంధిత అధికారులను పవన్ కళ్యాణ్ అభినందించారు. ఎల్ నినో వంటి అసాధారణ వాతావరణ పరిస్థితుల నుండి తీరాన్ని కాపాడడంలో ఈ గ్రీన్ వాల్ కీలక భూమిక పోషిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Advertisement

ఐదు కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ వాల్

రాష్ట్రంలో ఒక వెయ్యి 53 కిలోమీటర్ల తీరం పొడవునా, ఐదు కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ వాల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది 8888 హెక్టార్లలో విస్తరణ జరగనుందని అధికారులు పవన్ కళ్యాణ్ కు తెలిపారు. అక్టోబర్ నుండి మడ అడవుల స్థాపనకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని, ఈ సంవత్సరం మరింత వేగంగా పనులను ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించారు.

వనాలతోనే మూడంచెల రక్షణ వ్యవస్థ

ఈ గ్రీన్ వాల్ కార్యాచరణలో భాగంగా మొక్కలు నాటుతున్న క్రమంలో ఈ ప్రణాళికలో భాగంగా ఐదు వేల హెక్టార్లలో తాటి వనాలు నాటుతున్నారు. గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద మరో 1993 హెక్టార్లను దేశీయ మొక్కలతో నింపుతున్నారు. 727 హెక్టార్లను షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్ లు లక్ష్యంగా నిర్దేశించారు. మూడంచెల రక్షణ వ్యవస్థ ద్వారా మొక్కలు నాటి తీరాన్ని బలోపేతం చేస్తున్నారు.

Advertisement
ఏపీలో వారి ఖాతాల్లో రూ.25వేలు..ఇంకా రెండురోజులే అప్లైకి అవకాశం.. త్వరపడండి!

ఏపీ గ్రీనింగ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ సొసైటీ ద్వారా అన్ని శాఖల సమన్వయంతో ప్రాజెక్ట్

ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి వలయంలో మడ అడవుల పునరుద్ధరణ, షెల్టర్ బెల్ట్ మొక్కల పెంపకం జరుగుతుంది. రెండు, మూడు వలయాలను కమ్యూనిటీ బఫర్ జోన్లుగా గుర్తించి గ్రామ వనాలు, సామాజిక వనాలు, వ్యవసాయ వనాలను ప్రజలు వివిధ శాఖల సమన్వయంతో అభివృద్ధి చేస్తున్నారు. ఏపీ గ్రీనింగ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ సొసైటీ ద్వారా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్తున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. తీర రక్షణతో పాటు, పర్యావరణ సమతుల్యతను కాపాడే దిశగా ఈ కార్యక్రమం కీలకమని తెలిపారు.

English Summary

Great Green Wall of AP: Deputy CM Pawan Kalyan reviews the Great Green Wall of AP project, directs officials to accelerate mangrove expansion and coastal protection works along 1053 km coastline for climate resilience.