త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్..వారికి నెలకు రూ.10వేలు.. సూపర్ అప్డేట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ముఖ్యంగా న్యాయశాఖకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఈ మేరకు ఏపీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అనేక శుభవార్తలు చెప్పారు.

Advertisement

హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంత్రి కీలక ప్రకటన

రాయలసీమ వాసులు ఎన్నో ఏళ్లుగా కన్న కల అయిన ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటుపైన ఆయన కీలక ప్రకటన చేశారు. కర్నూలులో త్వరలోనే ఏపీ హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో స్థలం కేటాయించామని వెల్లడించారు. కర్నూల్ లో బెంచ్ ఏర్పాటు కోసం హైకోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

Advertisement

జూనియర్ లాయర్లకు మంత్రి శుభవార్త

అటు కేంద్రానికి కూడా హైకోర్టు బెంచ్ ప్రతిపాదనలను పంపించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియలు అన్నింటినీ పూర్తిచేసి త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కర్నూలు వేదికగా చేస్తామని కీలక ప్రకటన చేస్తారు. ఇదే సమయంలో జూనియర్ లాయర్లకు శుభవార్త చెప్పిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ లాయర్లకు ఇచ్చే స్టైఫండ్ ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలు పెంచుతున్నామని, ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు.

పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అంతేకాదు లా ఆఫీసర్ల పదవీ విరమణ వయసు 61సంవత్సరాలకు పెంచామని తెలిపారు. కొత్తగా 96 కోర్టులను ఏర్పాటు చేశామని, 1770 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. రాష్ట్రంలో కోర్టు భవనాలు, జడ్జిల క్వార్టర్ లు, గెస్ట్ హౌస్ లు వంటి వాటికి 216 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. హైకోర్టులో కేసులు త్వరగా పరిష్కరించే దిశగా 255 పోస్టులకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చామని అని వెల్లడించారు.

Advertisement

హైకోర్టు జడ్జీలకు గ్రాట్యూటీ పరిమితి పెంపు

హైకోర్టులో ఏజిపీల గౌరవ వేతనాన్ని 25% పెంచామన్నారు. హైకోర్టు జడ్జీలకు గ్రాట్యూటీ పరిమితిని 20 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచామని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ వెల్లడించారు. స్పెషల్ జ్యుడీషియరీ మేజిస్ట్రేట్ ల గౌరవ వేతనాన్ని 30 వేల రూపాయల నుంచి 45 వేల రూపాయలకు పెంచామని వారి రవాణా ఖర్చుల కింద నెలకు 5000 రూపాయలను మంజూరు చేశామని వెల్లడించారు.

English Summary

High Court bench in kurnool would be established soon said Minister N.M.D. Farooq . Sharing good news with junior lawyers, he stated that the monthly stipend increased from ₹5,000 to ₹10,000.